हैदराबाद : लोकसभा चुनाव की अधिसूचना जारी होने के अगले दिन ही देशभर में चुनाव संहिता लागू हो गई> इस पृष्ठभूमि में पुलिस पूरे आंध्र प्रदेश में सीमाओं और मुख्य जांच चौकियों पर व्यापक जांच कर रही है। पुलिस दिन-रात इस बात पर नजर कर रहे हैं कि नेता वोटरों को पैसे, शराब और अन्य चीजों का प्रलोभन न दे पाये।
इसी क्रम में पुलिस ने पूर्वी गोदावरी जिले के गोपालपुरम मंडल के जगन्नाथपुरम अंतर जिला चेक पोस्ट पर वाहनों का निरीक्षण किया। इस दौरान पुलिस को हैदराबाद से राजमंड्री जा रही श्री वीरंजनेया ट्रैवल्स की बस में 2.40 करोड़ रुपये की नकदी ले जाते हुए पकड़े गये। नकदी के संबंध में कोई दस्तावेज नहीं दिखाए जाने पर रकम जब्त कर ली गई। बहरहाल, इतनी बड़ी मात्रा में नकदी की बरामदगी पूरे राज्य में हड़कंप मच गया है।
తూర్పు గోదావరి జిల్లా జగన్నాథపురంలో పోలీసుల తనిఖీలో 2.40 కోట్ల నగదు సీజ్
హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు పకడ్బందీగా పహారా కాస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం అంతర్ జిల్లా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న శ్రీ వీరాంజనేయ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం అది ఎవరిదై ఉండొచ్చనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. (ఏజెన్సీలు)