हैदराबाद : तेलंगाना सरकार ने छह गारंटी के हिस्से के रूप में मुफ्त गैस कनेक्शन के लिए महालक्ष्मी योजना शुरू की है। सरकार मात्र 500 रुपये में सिलेंडर दे रही है। सरकारी आंकड़े बताते हैं कि तीन महीने के अंदर सिलेंडर की खपत बढ़ी है अधिकारियों ने बताया कि नागरिक आपूर्ति विभाग ने इस योजना के लागू होने की तारीख से अब तक 39,33,615 लोग इसके लिए पात्र हैं।
18,86,045 लोगों ने सिलेंडर रिफिल के लिए बुकिंग कराई। अब तक 21,29,460 सिलेंडर पात्र लाभार्थियों द्वारा लिये जा चुके हैं। योजना के कार्यान्वयन की तारीख से तीन महीने में रिफिल के उपयोग पर स्पष्टता मिलने के बाद नागरिक आपूर्ति विभाग एक अनुमान पर पहुंचा है। इस योजना के लिए राज्य सरकार ने दावा किया है कि 59.97 करोड़ रुपये आवंटित किये हैं।
पूरे तेलंगाना में कुल 1.20 करोड़ गैस कनेक्शन हैं। वहीं राशन कार्ड वाले परिवारों की संख्या 89.99 लाख है। बताया गया है कि गैस सिलेंडर की खपत की गणना इन परिवारों द्वारा तीन साल की अवधि में उपयोग किए गए गैस सिलेंडर के औसत को ध्यान में रखकर की गई है। नागरिक आपूर्ति विभाग के अधिकारियों ने पहले ही पाया है कि कुल 1.20 करोड़ कनेक्शनों में से 44 प्रतिशत हर महीने एक सिलेंडर का उपयोग कर रहे हैं। इस वित्तीय वर्ष के लिए महालक्ष्मी योजना की पहली तिमाही किस्त के तहत नागरिक आपूर्ति विभाग को 60 करोड़ रुपये की मंजूरी देने का आदेश जारी किया है।
మహాలక్ష్మి గ్యాస్ వినియోగం, 21 లక్షల సిలిండర్ల రీఫిల్లింగ్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.500లకే సిలిండర్ అందిస్తున్నారు. మూడు నెలల్లోనే సిలిండర్ల వినియోగం పెరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పథకానికి పథకం అమలు తేదీ నుంచి ఇప్పటి వరకు 39,33,615 మంది అర్హత పొందినట్టు అధికారులు తెలిపారు.
18,86,045 మంది సిలిండర్ల రీఫిల్ కోసం బుకింగ్స్ చేసుకున్నారు. ఇప్పటివరకు 21,29,460 సిలిండర్లను అర్హులైన లబ్ధిదారులు తీసుకున్నారు. పథకం అమలు తేదీ నుంచి గడిచిన మూడు నెలలుగా రీఫిల్ వినియోగంపై ఒక క్లారిటీ రావడంతో పౌర సరఫరాల శాఖ ఒక అంచనాకు వచ్చింది. రాష్ర్ట ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం రూ. 59.97 కోట్ల సబ్సిడీని క్లెయిమ్ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇక రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలు. ఈ కుటుంబాలు మూడేళ్ల కాలంలో వినియోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకొని గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని లెక్కగట్టిందని సమాచారం. మొత్తం 1.20 కోట్ల కనెక్షన్లు ఉండగా అందులో 44 శాతం మంది ప్రతి నెలా ఒక సిలిండర్ వాడుతున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు ఇదివరకే గుర్తించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మహాలక్ష్మి పథకం మొదటి త్రైమాసిక కిస్తీ కింద పౌర సరఫరాల శాఖకు రూ.60 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (ఏజెన్సీలు)