हैदराबाद: पूरा तेलंगाना में भीषण गर्मी/धूप से तिलमिला रहा है। भीषण गर्मी/धूम से लोग परेशान हैं। दक्षिण पश्चिम मानसून ने अब तक तेलंगाना में प्रवेश नहीं किया है। मानसून ने इस महीने की 11 तारीख को आंध्र प्रदेश में प्रवेश किया और वहीं पर थम गया। दक्षिण-पश्चिम मानसून रायलसीमा से आगे नहीं बढ़ा है। दक्षिण पश्चिम मानसून कर्नाटक के श्रीहरिकोटा और रत्नागिरी इलाकों में रुक गया है।
अब तक दक्षिण-पश्चिम मानसून देश के आधे से ज्यादा हिस्से में फैल जाना चाहिए था। मगर मानसून की गति आगे की ओर नहीं बढ़ने से कई राज्यों में तेज धूप का प्रकोप जारी है। तेलंगाना में असामान्य रूप से उच्च तापमान दर्ज किया जा रहा है। बरसात का मौसम आने पर भी लोग तेज धूप से परेशान हैं। तेलंगाना में इस महीने की 20 तारीख के बाद बारिश की संभावना है।
తెలంగాణ లోకి ప్రవేశించని నైరుతి రుతుపవనాలు, మండుతున్న ఎండలు
హైదరబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలోకి ఇంకా నైరుతి రుతుపవనాలు ప్రవేశించలేదు. ఈ నెల 11వ తేదీన ఏపీలోకి ప్రవేశించి అక్కడే స్తంభించాయి రుతుపవనాలు. రాయలసీమ నుంచి నైరుతి రుతుపవనాలు ముందుకు కదల్లేదు. శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయాయి.
ఈపాటికి దేశంలోని సగానికి పైగా ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాల్సి ఉంది. రుతుపవనాలు కదలకపోవటంతో పలు రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వర్షాకాలం వచ్చినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. తెలంగాణలో ఈ నెల 20 తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది.