हैदराबाद : अमेरिका के बोस्टन में लोगन इंटरनेशनल एयरपोर्ट पर बस की चपेट में आने से एक भारतीय-अमेरिकी की मौत का मामला देर से सामने आया है। आंध्र प्रदेश के रहने वाले विश्वचंद कोल्ला (47) ताकेडा फार्मास्युटिकल कंपनी में डेटा एनालिस्ट के तौर पर काम कर रहा था। 28 मार्च की शाम को वह अपने दोस्त को लेने लोगन इंटरनेशनल एयरपोर्ट गया था।
टर्मिनल बी पर इंतजार के दौरान एक तेज रफ्तार बस ने विश्वचंद को टक्कर मार दी। हादसे में उसकी मौके पर ही मौत हो गई। मृतक को पत्नी और दो बेटे हैं। पुलिस ने बस की पहचान डार्टमाउथ ट्रांसपोर्टेशन मोटर कोच कंपनी के रूप में की है।
बस चालक 54 वर्षीय महिला को हिरासत में लिया गया है और उससे पूछताछ की जा रही है। डार्टमाउथ ट्रांसपोर्टेशन कंपनी ने घटना पर खेद जताया है। ताकेडा फार्मास्युटिकल कंपनी ने कहा कि विश्वचंद का निधन बेहद दुखद है। उनके परिवार के प्रति संवेदनाएं।
అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం
హైదరాబాద్ : అమెరికా బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బస్సు ఢీ కొని ఓ ఇండియన్- అమెరికన్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన విశ్వచంద్ కొల్లా(47), తాకేడ ఫార్మాస్యూటికల్ కంపెనీలో డేటా అనలిస్ట్ గా పని చేస్తున్నారు. ఆయన మార్చి 28 సాయంత్రం తన స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.
టెర్మినల్ బీ వద్ద వెయిట్ చేస్తుండగా ఓ బస్సు వేగంగా వచ్చి విశ్వచందును ఢీకొట్టింది. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. బస్సు, డార్ట్‌మౌత్ ట్రాన్స్‌పోర్టేషన్ మోటార్ కోచ్ కంపెనీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు.
బస్సు డ్రైవరయిన 54 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై డార్ట్‌మౌత్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ విచారం వ్యక్తం చేసింది. విశ్వచంద్ మరణం చాలా బాధాకరమని తాకేడ ఫార్మాస్యూటికల్ కంపెనీ తెలిపింది. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేసింది. (ఏజెన్సీలు)