ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి…
గత 9 ఏళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు, డీఏ లు, పెన్షన్ల విషయంలో అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి లేదు. ఆత్మ గౌరవాన్ని కించపరిచే విదంగా ఉపాధ్యాయుల పట్ల ప్రవర్తిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ చత్తిస్ ఘడ్ లలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ ఆ దిశగా అడుగులు వేసేందుకు కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదు.
నేను పాదయాత్రలో ఇదే విషయాన్ని చెప్తున్నాను. మీరు గెలిపోయించిన ఎమ్మెల్సీ లు కేసీఆర్ వద్ద తమ స్వంత పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధ్యాయ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
హర్షవర్ధన్ రెడ్డి నిరంతరం ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. 13వ తేదీన జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో హర్షవర్ధన్ రెడ్డి కి ఓటు వేసి గెలిపోయించాలని విజ్ఞప్తి.
నేను 6వ తేదీ నుంచి పాదయాత్ర ఉన్నాను. అందువల్ల ముమ్మల్ని నేరుగా కలవలేక పోతున్నాను. మీరు హర్షవర్ధన్ రెడ్డిని గెలిపిస్తే సమాజానికి ఒక దిశ నిర్దేశం చేసినట్టు అవుతుంది. సమాజానికి విజ్ఞత నేర్పే మీరు ఈసారి విజ్ఞతతో కూడిన తీర్పు ఇస్తారని.. హర్ష వర్ధన్ రెడ్డి ని గెలిపిస్తారని ఆశిస్తున్నాను.
– రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు