हैदराबाद: तेलंगाना के एक युवा किसान ने खेत में जाने के लिए नया रास्ता ढूंढ निकाला। उसने नदी को पार करने के लिए छोटी-छोटी लकड़ी और रस्सी से एक पुल बनाया। लाठी-रस्सी से बने इस पुल से नदी को पार करें तो यह करीब 12 किमी.(दोनों पक्षों को मिलाकर) दूरी कम हो जाती है।
आदिलाबाद जिले के भैंसा मंडल के कतियम गांव के युवा किसान नागेश ने यह खोज की। जब वह कश्मीर की यात्रा पर गया तो उसने वहां एक पुल देखा और प्रभावित हुआ और वैसा ही पुल बनाया। नागेश का कहना है कि इसके लिए 10 हजार रुपए खर्च किए गए हैं।
नागेश के पास नदी के उस पार 10 एकड़ का खेत है। उस खेत में जाने के लिए एक नदी को पार करना पड़ता है। कई लोग पहले भी नाले में गिरकर घायल हो चुके हैं। एक युवक की मौत हो गई। नागेश उस नाले को पार करने के दौरान उसका 15 हजार का मोबाइल फोन खो गया।
कुछ रेत व्यापारियों द्वारा अवैध रूप से रेत निकालने के कारण नादी में गड्ढे बन गए हैं। नाले को पार करते समय उस गांव के कई लोग फिसल कर उसमें गिर गए। इसके चलते उनका कीमती सामान नदी गिरकर बह गया। शेख बाबा नामक युवक की पानी में डूब जाने से मौत हो गई।
नागेश ने कहा कि इस स्टिक ब्रिज के बनने से अब दो लोग नादी पार करके खेत में जा सकते हैं। स्थानीय और आसपास के लोग किसान के इस प्रयास की सराहना कर रहे हैं। आवश्यकता आविष्कार की जननी होती है। यह इसका ताजा उदाहरण है।
పొలానికి వెళ్లేందుకు కర్రలు, తాడుతో బ్రిడ్జి, యువ రైతు ఆవిష్కరణ
హైదరాబాద్ : పొలానికి వెళ్లేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. వాగు దాటేందుకు చిన్న చిన్న కర్రలతో బ్రిడ్జి ఏర్పాటు చేశాడు. కర్రలు, తాళ్లతో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి మీద నుంచి వాగు దాటితే.. సుమారు 12 కి.మీ. (ఇరువైపులా కలిపి) దూరం నడవాల్సిన పని తప్పుతోంది.
ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కతియం గ్రామానికి చెందిన యువ రైతు నాగేష్ ఈ ఆవిష్కరణ చేశాడు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఓ బ్రిడ్జిని చూసి స్ఫూర్తి పొంది.. అచ్చం అలాంటి బ్రిడ్జినే నిర్మించుకున్నాడు. ఇందుకోసం 10 వేల రూపాయలు ఖర్చయ్యిందని నాగేష్ చెబుతున్నారు.
వాగు ఆవల నాగేష్‌కు 10 ఎకరాల పొలం ఉంది. ఆ పొలానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. వాగు ప్రవాహంలో పడి ఇప్పటికే పలువురు ప్రమాదానికి గురయ్యారు. ఓ యువకుడు మృతి చెందాడు. నాగేష్ రూ. 15 వేల విలువైన సెల్ ఫోన్‌ను ఆ వాగు దాటేటప్పుడు పోగొట్టుకున్నాడు.
కొంత మంది ఇసుక వ్యాపారులు దొంగచాటున అక్రమంగా ఇసుక తీసుకపోవడం వల్ల వాగులో గుంతలు ఏర్పడ్డాయి. వాగు దాటే క్రమంలో ఆ గ్రామానికి చెందిన అనేక మంది కాలుజారి అందులో పడిపోయారు. విలువైన వస్తువులను కోల్పోయారు. షేక్ బాబా అనే యువకుడు నీళ్లలో మునిగి చనిపోయాడు.
ఈ కర్రల బ్రిడ్జి ఏర్పాటుతో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అలవోకగా వాగు దాటి, పొలం వెళ్లేందుకు వీలు కలిగిందని నాగేష్ తెలిపారు. ఈ రైతు ప్రయత్నాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు. అవసరం వినూత్న ఆవిష్కరణలను సృష్టిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. (ఏజెన్సీలు)