హైదరాబాద్ : గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారి అధ్యక్షతన డిసెంబర్ నెల ఎక్స్క్యూటివ్ మీటింగ్ జరిగింది. జిల్లా కమిటీలు ఎంతవరకు పూర్తి చేశారు, మండల కమిటీలు, బ్లాక్ కమిటీలు, పట్టణ కమిటీలు, డివిజన్ ప్రెసిడెంట్స్ వారి వారి జిల్లా నుండి లిస్టు తెప్పించుకొని రివ్యూ చేయడం జరిగింది.
కమిటీలు వేయని వారిని వేయాలని సూచించడం జరిగింది, హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రోగ్రాం గురించి వివరించడం జరిగింది, గడపగడపకు కాంగ్రెస్ ద్వారా బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటి తిరగడం పాంప్లెట్స్ పంచి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించాలని చెప్పడం జరిగింది,
ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రానికి కృషి చేయాలని సునీత రావు తెలుపడం జరిగింది. ఇకమీదట నుంచి ప్రతి జిల్లాను విజిట్ చేసి రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తానని సునీత రావు తెలియజేయడం జరిగింది.
కార్యక్రమంలో ఇన్చార్జి కోఆర్డినేటర్ నీలం పద్మ, జిల్లా అధ్యక్షులు ఇందిర, శ్రీదేవి, కవిత, సరిత, జయమ్మ, విజయలక్ష్మి, శోభ వసంతం, జ్ఞానేశ్వరి, సౌజన్య, లక్ష్మి, దుర్గారాణి, ఆర్ లక్ష్మి, పావని పుష్పరెడ్డి, సుజాత లత, అనిత మొదలగు వారు పాల్గొన్నారు.