Hyerabad : రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిపై బిజెపి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తుందని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి గారు అన్నారు. ఎమ్మెల్సీ కవిత గారిపై మోపిన అక్రమ కేసులను ఖండిస్తూ సోమవారం పత్రిక ప్రకటనను వారు విడుదల చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఏ సంబంధం లేని కల్వకుంట్ల కవిత పై బలవంతంగా అభియోగాలు మోపుతున్నారని అందులో భాగంగానే సిబిఐ, ఈడి ఐటి కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
అసలు ఢిల్లీ మద్యం కేసు సంబంధించి స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారే తమ ప్రభుత్వం కు ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారని అలాంటప్పుడు కవిత గారికీ సంబంధం ఏముంటుందని బీజేపీ ప్రభుత్వం కావాలనే తమ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులను బధనం చేస్తు బెదిరిస్తుందని ఈ బోడి బెదిరింపులకు భయపడే బిడ్డ కవిత అక్క కాదని ఉద్యమ యోధురాలి బిడ్డ అని, కవిత గారి మీద మా మంత్రుల మీద బిజెపి జేబు సంస్థల దాడి తెలంగాణ ప్రజలపై దాడీగా చూస్తామని ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.
ఢిల్లీ మద్యం కేసులో సాక్షిగా మాత్రమే ఉన్న కవిత గారు ఎక్కడ బెదరకుండా సిబిఐకి 160CRP కింద వివరణ ఇస్తే , మరి తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి సాక్షాలతో సహా ఆడియో, వీడియో లతో అడ్డంగా స్వాములు కోర్ట్ స్టే తో దర్జాగా తిరుగుతున్నారు. కేసులో ప్రధానమైన వ్యక్తి బీజేపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ కి 41 సి.ఆర్.పి కింద నోటీసులు జారీ చేస్తే కోర్టు స్టే తో చట్టాలని అడ్డం పెట్టుకొని కేసులకు హాజరుకాకుండా తప్పించు కొని తిరుగు తున్నడు. ఇందులో అసలు దొంగలు ఎవరు? ప్రజాస్వామ్యన్ని కాపాసుతున్నాది ఎవరు? మనం అభినందించాల్సి ఎవరిని? నిందించాల్సింది ఎవరని? ప్రజలు అన్ని గమనిస్తున్నారు సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడుతరు.
నిన్నగాక మొన్న జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలో ప్రజల ఆశీస్సులతో సంపూర్ణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ బిజెపి దొంగల నుండి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రాజస్థాన్ కు ఏందుకు తరలించాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచించాలి, బిజెపి పార్టీ ప్రజాస్వామ్యన్ని ఎలా కూని చేస్తుందో, దేశంలో బిజెపి వల్ల రాష్ట్రాల పరిస్థితి ఏందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా పరిపాలిస్తూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలను తమ జేబు సంస్థలుగా వాడుకొని తమ విధానాలను వ్యతిరేకించిన ప్రతి వారిపై ఈ విధంగానే దాడులు చేపడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం ప్రకటన వచ్చిన నాటి నుండే తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల ఇళ్లపై ఐటి రైట్స్, సిబిఐ రైడ్స్ జరుగుతున్నాయన్నారు. అక్రమ కేసులతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబ ప్రతిష్ట దిగజార్చడానికి బీజేపీ పార్టీ కుట్రలు చేస్తున్నారని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారిణిగా కేసీఆర్ తనయగా కవిత గారు ఎన్ని కేసులను ఎదుర్కోవడానికైనా సిద్ధమే కానీ బీజేపీ పార్టీకి భయపడే అవకాశమే లేదన్నారు. బిజెపి చేస్తున్న అరాచక పనులను బీఆర్ఎస్ వేదికగా దేశ ప్రజల ముందు ఉంచి వారికి రానున్న సాధారణ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.