हैदराबाद : तेलंगाना में एक साल में 1.73 लाख मोबाइल फोन खोने की शिकायतें मिली है। लेकिन उनमें से केवल 35 फीसदी फोन रिकवरी कर पाये है। पिछले साल 20 अप्रैल से अब तक पुलिस ने केवल 29,500 मोबाइल फोन जब्त किए हैं। बाकी 1.43 लाख फोन गायब हैं। पुलिस उनकी लोकेशन तलाश रही है। पुलिस ने पाया है कि तस्करी करने वाले गिरोह IMEI 16-अंकीय नंबरों में से 2 नंबरों को हटाकर और उनके स्थान पर 2 नए नंबर जोड़कर सेल फोन को श्रीलंका और अफ्रीकी देशों में ले जा रहे हैं।
हैदराबाद पुलिस ने हाल ही में एक गिरोह को गिरफ्तार किया है जो चोरी के मोबाइल फोन सूडान ले जा रहा था। पीड़ितों ने अपनी शिकायत में कहा कि CEIR पोर्टल के माध्यम से पंजीकृत 1.73 लाख मोबाइल फोन चोरी/गायब हो गए। इनमें से 35 फीसदी (29,500) की रिकवरी हो चुकी है। पुलिस को संदेह है कि 40 फीसदी फोन विदेश चले गये हैं। बाकी 25 फीसदी फोन का अभी भी पता नहीं चल पाया है।
तस्करी करने वाले गिरोह मोबाइल फोन के पुर्जो को अलग-अलग करके बेच रहे हैं ताकि पुलिस इन्हें ढूंढ न सके। ऐसे फोनों का पता लगाना लगभग असंभव है। यही एक कारण है कि इतने सारे फोन नहीं मिल रहे हैं। जिन पीड़ितों का फोन खो गया है वे इस उम्मीद से इंतजार कर रहे हैं कि कभी न कभी उनका फोन मिल आएगा। पुलिस फोन ढूंढने की पूरी कोशिश कर रही है। इस महीने की 16 तारीख को राज्य भर में 199 फोन बरामद किये गये। सीआईडी की एडिशनल डीजी शिखा गोयल ने इन फोनों को बरामद करने वाले पुलिस अधिकारियों को बधाई दी है।
यह भी पढ़ें-
सीईआईआर में दर्ज शिकायतों पर जब पुलिस जांच पड़ताल करने पर पाया कि हमारे राज्य के फोन केरल, यूपी, बिहार और अन्य राज्यों के लोग उठा रहे हैं। आपको यह फ़ोन कैसे मिला, तो कुछ लोग कहते हैं कि उन्होंने इसे इसलिए खरीदा है क्योंकि यह सस्ता था और कुछ कह रहे हैं कि उन्होंने इसे इसलिए खरीदा क्योंकि अत्यावश्यक था। पुलिस उनसे कह रही है कि इस फोन के गुम होने का मामला दर्ज हो चुका है और इसे खरीदना अपराध है। यह जानकरक 10 फीसदी लोग इसे कूरियर से वापस भेज रहे हैं। ऐसे फोनों को पीड़ितों को वापस लौटा दे रहे हैं।
ఏడాదిలో మిస్ అయిన ఫోన్లు 1.73 లక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఒక ఏడాదిలో 1.73 లక్షల మొబైల్ ఫోన్‌లు పోయినట్లు ఫిర్యాదులు అందితే వాటి లో 35 శాతం మాత్రమే రికవరీ చేయగలిగారు. గత ఏడాది ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు పోలీసు లు స్వాధీనం చేసుకున్నవి కేవలం 29,500 మొబైల్ ఫోన్‌లు మాత్రమే. ఇంకా 1.43 లక్షల ఫోన్‌లు మిస్సిం గ్‌లోనే ఉన్నాయి. వీటి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీటిలో ఇప్పటికే అత్యధికంగా ఐఎం ఈఐ 16 అంకెల నంబర్‌లలోని 2 నెంబర్‌లను తొల గించి వాటి స్థానంలో మరో 2 కొత్త అంకెలను చేర్చి శ్రీలంక, ఆఫ్రికా దేశాలకు సెల్ ఫోన్‌లను స్మగ్లింగ్ ముఠాలు తరలిస్తున్నాయని పోలీసులు గుర్తించారు.
సూడన్ దేశానికి చోరీ మొబైల్స్ ఫోన్‌లను తరలిస్తున్న ముఠాను ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నమోదైన 1.73 లక్షలు మొబైల్ ఫోన్‌లు చోరీ, మిస్సింగ్ అయినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిలో 35 శాతం (29,500) రికవరీ అయ్యాయి. 40 శాతం విదేశాలకు తరలి పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా 25 శాతం ఫోన్ల ఆచూకీ ఇంకా అన్ ట్రేసబుల్ కిందనే ఉన్నాయి.
పోలీసులకు దొరకొద్దని మొబైల్ ఫోన్ స్మగ్లింగ్ ముఠాలు విడి భాగాలుగా చేసి విక్రయిస్తున్నారు. ఇలా చేస్తే గుర్తించడం దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. చాలా ఫోన్లు దొరక్క పోవడానికి ఇది ఒక కారణంగానే తెలుస్తోంది. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు తమ ఫోన్ ఎప్పటికైనా తిరిగి వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఫోన్ కనుగొనేందుకు పోలీసులు తమ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన రాష్ర్ట వ్యాప్తంగా ఒకే సారి 199 ఫోన్‌లను రికవరీ చేశారు. వీటిని రికవరీ చేసిన పోలీసు అధికారులను సీఐడీ అదనపు డీజీ శిఖ గోయల్ అభినందించారు.
సీఈఐఆర్‌లో నమోదైన ఫిర్యాదులపై పోలీసులు ద ర్యాప్తు చేసినప్పుడు మన రాష్ట్ర ఫోన్‌లు కేరళ, యూపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉన్నవారు లిఫ్ట్ చేస్తున్నారు. ఈ ఫోన్ మీకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే ‘తక్కువ ధరకు వస్తే కొన్నామని కొందరు అత్యవసరం అని చెప్పడం కొన్నాం’ అని ఇంకొందరు సమాధానం ఇస్తున్నారు. ఈ ఫోన్‌పై మిస్సింగ్ కేసు నమోదైందని, ఇది కొనడం నేరమని చెప్పడంతో 10 శాతం మంది కొరియర్ ద్వారా తిరిగి పంపిస్తున్నారు. (ఏజెన్సీలు)