Balagam Movie : ‘बलगम’ फिल्म का असर, एक हो गये दो भाई, गांवों में बड़े पर्दे पर किया जा रहा है प्रदर्शित

हैदराबाद: ‘बलगम’ (परिवार) फिल्म सबको सोचने पर मजबूर कर रहा है कि अगर पूरा परिवार बिना झगड़ों के साथ रहता है तो हर कार्य में अच्छा होता है। इस फिल्म में निर्देशक वेणु द्वारा मानवीय रिश्तों और परिवार के महत्व के बारे में दिखाए गए दृश्यों को देखने वाले आंसू नहीं रोक पा रहे हैं। इस फिल्म के कुछ सीन ऐसे हैं जो दिल को छू जाते हैं। फिल्म देखने वालों की आंखों से आंसू आ रहे हैं। इस फिल्म में दिखाया गया है कि अगर घर में छोटी-छोटी बातों पर झगड़ा हो जाए तो नुकसान हो जाता है। साथ ही मिलकर रहे है तो सब कुछ अच्छा होता है।

तेलंगाना में इस फिल्ल को देखकर दो भाइयों ने पालन किया। इस फिल्म को देखने के बाद दोनो भाइयों ने अपने मतभेद सुलझा लिए और एक हो गए। निर्मल जिले के लक्ष्मणचांदा मंडल केंद्र में हुई यह घटना अब चर्चा का विषय बन गया है। गांव निवासी गुर्रम पोसुलू और गुर्रम रवि इन दो भाइयों के बीच कई सालों से भू विवाद चल रहा है। नतीजतन, दोनों परिवारों के बीच बातचीत नहीं है।

मिली जानकारी के अनुसार, शनिवार को गांव के सरपंच सुरकंटी मुत्यम रेड्डी के नेतृत्व में गांव में फिल्म ‘बलगम’ का निशुल्क प्रदर्शन किया गया। इस फिल्म में पिता की कब्र की जगह को लेकर भाइयों के बीच लड़ाई जैसे दृश्यों को देखकर भावुक हो गए और फिर गुर्रम पोसुलू और गुर्रम रवि अपने दोनों एक साथ हो गए। फिल्म के प्रभाव से उन्होंने अपने भू विवाद को सुलझा लिया। दोनों गाँव के बुजुर्गों की मौजूदगी में फिर से मिले। इस घटना से दोनों के परिवार वाले भी खुश हो गये।

कई नेटिज़न्स टिप्पणी कर रहे हैं कि इन भाइयों को देखकर यह समझ में आता है कि फिल्मों का लोगों पर कितना प्रभाव पड़ता है। कई गांवों में बलगम फिल्म को बड़े पर्दे पर दिखाया जा रहा है। यह फिल्म कई परिवारों को प्रभावित कर रहा है। इस फिल्म के जरिए कई लोग पारिवारिक मूल्यों को जान रहे हैं।

అన్నదమ్ములు ఒక్కటయ్యేలా చేసిన ‘బలగం’ మూవీ, సినిమా చూసి రాజీ

హైదరాబాద్ : కుటుంబమంతా గొడవలు లేకుండా కలిసి మెలిసి జీవిస్తే ప్రతి పనిలోనూ మంచి జరుగుతుందనే కథతో వచ్చిన ‘బలగం’ మూవీ అందరినీ ఆలోచింపచేస్తోంది. మానవ సంబంధాలు, కుటుంబ ప్రాధాన్యత గురించి ఈ సినిమాలో డైరెక్టర్ వేణు చూపించిన సన్నివేశాలు సినిమా చూసేటప్పుడు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మనస్సుకు హత్తుకునేలా ఈ సినిమాలోని కొన్ని సీన్లు ఉన్నాయి. సినిమా చూసినవారి కళ్ల వెంట కన్నీళ్లు వస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు పట్టింపులకు పోయి కుటుంబంలో గొడవలు జరిగితే నష్టమే జరుగుతుందని, అదే కలిసి ఉంటే మంచి జరుగుతుందని ఈ సినిమాలో చూపించారు.

ఇద్దరు అన్నదమ్ములు దీనిని ఫాలో అయ్యారు. ఈ సినిమా చూసిన తర్వాత తమ మధ్య ఉన్న గొడవలను పరిష్కరించుకుని ఒక్కటయ్యారు. నిర్మల్‌ జిల్లాలోని లక్ష్మణచాంద మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్రామానికి చెందిన గుర్రం పోసులు, గుర్రం రవి అనే అన్నదమ్ములు స్థల వివాదం కారణంగా ఎన్నో ఏళ్లుగా గొడవలు పడుతున్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య సరిగ్గా మాటలు లేవు.

అయితే శనివారం గ్రామ సర్పంచ్‌ సూరకంటి ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ‘బలగం’ సినిమాను గ్రామంలో ఉచితంగా ప్రదర్శించారు. ఈ సినిమాలో తండ్రి సమాధి స్థలం విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగే గొడవలు, ఆ తర్వాత ఇద్దరూ కలిసి పోవడం లాంటి సీన్లను చూసి గుర్రం పోసులు, గుర్రం రవి ఎమోషనల్ అయ్యారు. సినిమా ప్రభావంతో స్థలం విషయంలో తమకు ఉన్న వివాదాన్ని పరిష్కరించుకున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో కూడా ఆనందం నెలకొంది.

అన్నదమ్ములు స్థలం విషయంలో రాజీ కుదర్చుకుని ఒక్కటి కావడాన్ని చూసి గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. సినిమాలు చూసి అన్నదమ్ములు మనస్సు మార్చుకుని కలిసిపోయిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా అన్నదమ్ములు మధ్య జరుగుతున్న గొడవలు ఒక్క సినిమాతో సమసిపోవడాన్ని చూసి కాస్త షాక్‌కు గురవుతున్నారు.

సినిమాల ప్రభావం జనాలపై ఎంతగా ఉంటుందో ఈ అన్నదమ్ములను చూస్తే అర్ధమవుతుందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా బలగం సినిమాను చాలా గ్రామాల్లో పెద్ద తెరపై ప్రదర్శిస్తున్నారు. దీంతో చాలామంది కుటుంబాలను ఈ సినిమా ప్రభావితం చేస్తుంది. కుటుంబ విలువలు చాలామంది ఈ సినిమా ద్వారా తెలుసుకుంటున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X