हैदराबाद: विजयवाड़ा में एसीबी (तृतीय अतिरिक्त सत्र) अदालत ने कौशल विकास घोटाला मामले में तेलुगु देशम नेता चंद्रबाबू को 14 दिनों की न्यायिक हिरासत में सजा सुनाई है। कोर्ट ने चंद्रबाबू को इस महीने की 22 तारीख तक रिमांड पर भेज दिया। फैसला आते ही पुलिस उन्हें भारी पुलिस सुरक्षा के बीच विजयवाड़ा से राजमंड्री सेंट्रल जेल ले जा रहे हैं। जेड प्लस श्रेणी की सुरक्षा के तहत उन्हें सब जेल के बजाय सेंट्रल जेल में स्थानांतरित किया जा रहा। इस बीच, चंद्रबाबू के वकीलों ने अदालत से अपील की कि उनकी रिमांड अवधि को हाउस अरेस्ट माना जाए। जमानत के लिए सोमवार को राज्य उच्च न्यायालय में लंच मोशन याचिका दायर की जायेगी।
अपने चार दशक से अधिक के राजनीतिक करियर में भ्रष्टाचार के कई आरोप झेलने के बावजूद वह पहली बार जेल गए। भ्रष्टाचार निरोधक विभाग और सीआईडी विभागों ने कौशल विकास निगम मामले में सार्वजनिक धन के दुरुपयोग के जीएसटी जांच विवरण के आधार पर मामला दर्ज किया और चंद्रबाबू को गिरफ्तार कर अदालत में पेश किया और मजिस्ट्रेट ने न्यायिक रिमांड का आदेश दिया। फैसले के तुरंत बाद चंद्रबाबू के वकीलों ने जमानत के लिए एसीबी कोर्ट में हाउस मोशन याचिका दायर की।
कौशल विकास निगम भ्रष्टाचार के आरोप में शनिवार सुबह नंद्याला में गिरफ्तार किए गए चंद्रबाबू को रविवार सुबह विजयवाड़ा में एसीबी अदालत में पेश किया गया। सुप्रीम कोर्ट के वरिष्ठ अधिवक्ता सिद्धार्थ लुद्रा ने चंद्रबाबू की ओर से बहस की, जबकि अतिरिक्त महाधिवक्ता पोन्नावोलु सुधाकर रेड्डी, अधिवक्ता वेंकटेश और अन्य ने राज्य सरकार की ओर से बहस की। दोनों पक्षों के करीब 15 वकीलों ने रविवार सुबह से दोपहर 2.30 बजे तक कई मुद्दों पर लंबी दलीलें पेश कीं। मजिस्ट्रेट ने शाम 6.48 बजे फैसला सुनाते हुए कहा कि जांच प्रक्रिया आखिरकार पूरी हो गई है।
संबंधित खबर:
चंद्रबाबू की ओर से बोलते हुए सुप्रीम कोर्ट के वकील सिद्धार्थ लूथरा ने कोर्ट को बताया कि यह मामला राजनीति से प्रेरित और दुर्भावनापूर्ण इरादे से दर्ज किया गया है। उन्होंने कहा कि राजनीतिक मकसद से चंद्रबाबू को इस मामले में फंसाने की कोशिश की गई है। उन्होंने याद दिलाया कि दो साल पहले इस मामले में एफआईआर दर्ज होने के बावजूद चंद्रबाबू का नाम शामिल नहीं किया गया। पुलिस की ओर से सौंपी गई 28 रिमांड रिपोर्ट में कहा गया है कि चंद्रबाबू के खिलाफ इन आरोपों से जुड़ी 34 धाराओं के तहत आरोप दर्ज किए गए हैं। कोर्ट ने एडिशनल एजी से पूछा कि इस मामले में अब तक चंद्रबाबू को गिरफ्तार क्यों नहीं किया गया। चंद्रबाबू के खिलाफ रिमांड रिपोर्ट में उल्लिखित धारा 409 पर सिद्धार्थ लूथरा ने एसीबी कोर्ट में जमकर बहस की और कहा कि यह धारा लगाने का पर्याप्त आधार नहीं है। उन्होंने कहा कि सीआईडी ने चंद्रबाबू के अधिकारों का हनन करने का काम किया है।
सिद्धार्थ लूथरा, जिन्होंने अदालत का ध्यान इस ओर दिलाया कि चंद्रबाबू की गिरफ्तारी के पीछे राजनीतिक दबाव हैं। उन्होंने पहले पंजाब मनिंदर सिंह के मामले का जिक्र करते हुए जोर दिया कि रिमांड रिपोर्ट को खारिज कर दिया जाना चाहिए क्योंकि इसमें पर्याप्त आधार नहीं है। अदालत को समझाया गया कि चूंकि चंद्रबाबू पूर्व मुख्यमंत्री है, इसलिए चंद्रबाबू को गिरफ्तार करने से पहले राज्यपाल से अनुमति लेनी होगी और भ्रष्टाचार निवारण अधिनियम की धारा 17 भी यही कहती है। लेकिन सीआईडी पुलिस ने चंद्रबाबू की गिरफ्तारी को लेकर राज्यपाल से कोई इजाजत नहीं ली। उन्होंने कोर्ट से इस रिमांड रिपोर्ट को खारिज करने की अपील की।
सरकार की ओर से एडिशनल एजी पोन्नावोलू सुधाकर रेड्डी ने बताया कि चंद्रबाबू नायडू सिर्फ पूर्व मुख्यमंत्री हैं और फिलहाल सिर्फ विधायक हैं। पूर्व मुख्यमंत्री ने कहा कि यह सिर्फ स्टेटस पर लागू होता है। केस की सुनवाई में विशेषाधिकार या प्रोटोकॉल के तौर पर नहीं। चूंकि उन्हें सिर्फ विधायक माना जाता है। इसलिए उन्होंने विधानसभा अध्यक्ष को गिरफ्तारी की सूचना दे दी है। इसकी जानकारी तीन माह के भीतर किसी भी समय राज्यपाल को दी जा सकती है। अदालत को यह समझाया गया कि कोई नोटिस जारी करने की कोई आवश्यकता नहीं है क्योंकि आपराधिक अपराध के पुख्ता सबूत है। उन्होंने कहा कि गिरफ्तारी के 24 घंटे के अंदर उन्हें कोर्ट में पेश किया जाएगा। उन्होंने कहा कि इस मामले में आठ लोगों को पहले ही गिरफ्तार किया जा चुका है।
अदालत ने एडिशनल एजी से पूछा कि दो साल पहले इस मामले में एफआईआर दर्ज होने के बावजूद उन्हें बिना गिरफ्तारी के अब फैसला क्यों लेना पड़ा। उन्होंने पूछा कि उस एफआईआर में चंद्रबाबू का नाम क्यों नहीं था। उन्होंने सवाल किया कि क्या चंद्रबाबू की भूमिका पर प्राथमिक सबूत हैं। इसके जवाब में एडिशनल एजी ने बताया कि रिमांड रिपोर्ट में सभी बिंदुओं को शामिल किया गया है और इस मामले में उनके संबंध की पुष्टि के लिए सभी विवरण और सबूत मौजूद हैं। एसीबी कोर्ट में रविवार सुबह 8 बजे बहस शुरू हुई और बीच में तीन ब्रेक के साथ दोपहर 2.30 बजे तक बहस जारी रही। रिमांड रिपोर्ट की बातों के साथ-साथ चंद्रबाबू के खिलाफ दर्ज विभिन्न धाराओं को लेकर भी काफी देर तक बहस की गई।
బిగ్ బ్రేకింగ్: ACB కోర్టు సంచలన తీర్పు, చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విజయవాడలోని ఏసీబీ (థర్డ్ అడిషనల్ సెషన్స్) కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 22వ తేదీ వరకు చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. తీర్పు రావడంతోనే ఆయనను భారీ పోలీసు భద్రత నడుమ విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నందున ఆయనను సబ్ జైలుకు బదులుగా సెంట్రల్ జైలుకు తరలించాల్సి వస్తున్నది. ఇదిలా ఉండగా ఆయన రిమాండ్ కాలాన్ని హౌస్ అరెస్ట్ గా పరిగణించాలని చంద్రబాబు తరుఫు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర హైకోర్టులో సోమవారం బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.
నాలుగున్న దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఫస్ట్ టైమ్ ఆయన జైలుకు వెళ్ళారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ప్రజాధనం దుర్వినియోగమైనట్లు జీఎస్టీ దర్యాప్తు వివరాల ఆధారంగా కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ, సీఐడీ విభాగాలు చంద్రబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. తీర్పు వెలువడిన వెంటనే బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతి ఆరోపణలపై శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టయిన చంద్రబాబును ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదించగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాదులు వెంకటేశ్ తదితరులు వాదించారు. ఇరు తరఫున సుమారు 15 మంది చొప్పున న్యాయవాదులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అనేక అంశాలపై సుదీర్ఘ స్థాయిలో వాదనలను వివరించారు. చివరకు విచారణ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్న మేజిస్ట్రేట్ తీర్పును సాయంత్రం 6.48 గంటలకు ప్రకటించారు.
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని, దురుద్దేశంతో నమోదు చేసిందనేనని కోర్టుకు వివరించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబును ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరిగిందన్నారు. రెండేండ్ల క్రితం ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదైనా చంద్రబాబు పేరును చేర్చలేదని గుర్తుచేశారు. పోలీసులు సమర్పించిన 28 రిమాండ్ రిపోర్టులో ఈ ఆరోపణలకు సంబంధించిన చంద్రబాబుపై మొత్తం 34 సెక్షన్ల క్రింద అభియోగాలను నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని అదనపు ఏజీని కోర్టు ప్రశ్నించింది. చంద్రబాబుపై రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సిద్ధార్థ లూథ్రా తీవ్ర స్థాయిలో వాదించి ఆ సెక్షన్ పెట్టడానికి తగిన గ్రౌండ్ లేదన్నారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సీఐడీ వ్యవహరించిందన్నారు.
చంద్రబాబు అరెస్టు వెనక రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్ళిన సిద్ధార్థ లూథ్రా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచే ఈ వ్యవహారంపై సీఐడీ పోలీసులు కసరత్తు మొదలుపెట్టినందున వారి ఫోన్ సంభాషణలను, కాల్ డేటా రికార్డులను కోర్టుకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. రిమాండ్ రిపోర్టులో తగిన గ్రౌండ్ లేనందున దాన్ని తిరస్కరించాలని నొక్కి చెప్తూనే గతంలో పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నందున చంద్రబాబును అరెస్టు చేసే ముందు విధిగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఇదే చెప్తున్నదని కోర్టుకు వివరించారు. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతిని సీఐడీ పోలీసులు తీసుకోలేదని గుర్తుచేశారు. ఈ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి మాత్రమేనని, ప్రస్తుతం కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వివరించారు. మాజీ ముఖ్యమంత్రి అనేది హోదాకు మాత్రమే వర్తిస్తుంది తప్ప కేసు విచారణలో అది ఒక ప్రివిలెజ్ లేదా ప్రోటోకాల్‌గా ఉండదన్నారు. ఎమ్మెల్యేగా మాత్రమే పరిగణిస్తున్నందున అరెస్టుకు సంబంధించి శాసనసభ స్పీకర్‌కు తెలియజేశామన్నారు. గవర్నర్‌కు మూడు నెలల వ్యవధిలో ఎప్పుడైనా సమాచారం ఇవ్వొచ్చన్నారు. క్రిమినల్ నేరానికి పాల్పడినట్లు బలమైన ఆధారాలు ఉన్నందున ఎలాంటి నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు వివరించారు. అరెస్టు చేసిన తర్వాత 24 గంటల వ్యవధి లోపే కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.
రెండేండ్ల క్రితం ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ అరెస్టు చేయకుండా ఇప్పుడే ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ అదనపు ఏజీని కోర్టు ప్రశ్నించింది. ఆ ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరును ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. దీనికి బదులిచ్చిన అదనపు ఏజీ… రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలనూ చేర్చామని, ఈ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం ఏ తీరులో ఉన్నదో ధృవీకరించే వివరాలు, ఆధారాలన్నీ ఉన్నాయని వివరించారు. ఏసీబీ కోర్టులో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాదనలు మధ్యలో మూడు విడతలుగా విరామం ఇచ్చి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకూ కంటిన్యూ అయింది. రిమాండ్ రిపోర్టులోని అంశాలతో పాటు చంద్రబాబుపై నమోదు చేసిన పలు సెక్షన్ల చుట్టూ ఎక్కువ సేపు వాదనలు జరిగాయి. (ఏజెన్సీలు)