एमएलसी कविता का अनशन खत्म, अब ईडी की जांच, दिल्ली पर टिकी सबकी निगाहें!

हैदराबाद: दिल्ली के जंतर मंतर पर भारत जागृति अध्यक्ष और बीआरएस एमएलसी कल्वकुंटला कविता का अनशन सफलतापूर्वक संपन्न हो गई गया। देश भर के 18 दलों के नेताओं ने विधानसभाओं में महिलाओं के लिए आरक्षण बिल के लिए कविता द्वारा शुरू की गई इस पहल का समर्थन किया है। CPIM महासचिव सीताराम येचुरी भी इस अनशन में शामिल हुए। कविता ने खुलासा किया कि अनशन से शुरू हुआ संघर्ष संसद में महिला आरक्षण विधेयक के पारित होने तक जारी रहेगा।

ఎమ్మెల్సీ కవిత దీక్ష ముగిసింది, ఈడీ విచారణే తరువాయి, అందరి దృష్టి ఢిల్లీ పైనే!

హైదరాబాద్ : ఢిల్లీ జంతర్ మంతర్‌లో భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన దీక్ష విజయవంతంగా ముగిసింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు కోసం కవిత తలపెట్టిన ఈ దీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 18 పార్టీల నేతలు మద్దతు పలికారు. ఈ దీక్షకు మద్దతుగా సీపీఐఏం ముఖ్య కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఈ దీక్షతో మొదలుపెట్టిన పోరాటం పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసయ్యేవరకు కొనసాగుతుందని కవిత వెల్లడించారు.

మోదీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ బిల్లు పాసవుతుందని కవిత తెలిపారు. డిసెంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు పోరాడుతూనే ఉంటామని తెలిపారు. రాష్ట్రపతికి కూడా తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు కవిత తెలిపారు. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని దేశమంతటికి సంబంధించిందని కవిత తెలిపారు. ఇవాళ ప్రారంభించిన పోరాటం భవిష్యత్తులో మరింత ఉద్దృతం అవుతుందని తెలిపారు. తమ దీక్షకు మద్దతిచ్చిన అన్ని పార్టీలకు ధన్యావాదాలు తెలిపారు కల్వకుంట్ల కవిత.

మొత్తానికి అనుకున్నట్టుగానే కవిత దీక్షను ప్రశాంతంగా ముగించారు. ఇదే సమయంలో అటు బీజేపీ నేతలు కూడా ధర్నా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు ముచ్చట ఇప్పుడు మొదలైంది. రేపు ఈడీ విచారణకు కవిత హాజరవుతున్న నేఫథ్యంలో సర్వత్రా చర్చకు తెరలేసింది.

ఈడీ నోటీసులివ్వగా ఇవాళ దీక్ష ఉందన్న కారణంతో రేపు హాజరవుతానని కవిత లేఖ రాశారు. అయితే కవిత ప్రతినిధిగా వాంగ్మూలం ఇచ్చి అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న అరుణ్ పిళ్లైని, కవితను ఇద్దరి కలిపి అధికారులు విచారించనున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ప్రశ్నలడుగుతుతారు? విచారణ తర్వాత అధికారులు తీసుకోబోయే చర్యలేంటీ? ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న విధంగా కవితను నిజంగానే అరెస్టు చేస్తారా? ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పిటిషన్ వేశారు. వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునే అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానంలో అరుణ్ పిళ్లై పిటిషన్ వేశారు. కాగా పిళ్లై పిటిషన్‌తో ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే గత ఐదు రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న పిళ్లై స్టేట్ మెంట్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే 11 సార్లు రికార్డు చేయటం గమనార్హం.

ఈ వాంగ్మూలంలో తాను కవిత ప్రతినిధినని చెప్పటం సర్వత్రా చర్చనీయాంశమైంది. పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితకు అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. ఇప్పుడు పిళ్లై ఇచ్చిన ట్విస్ట్‌తో ఈడీ ఎలాంటి స్టెప్ తీసుకోనుందని అందురూ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపటి విచారణ ఉంటుందా లేదా అనుకున్నట్టుగానే నిర్వహిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అసలు రేపు ఏం జరగనుందన్న ఉత్కంఠతో అందరి కళ్లు కవిత మీదే ఉన్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X