డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు కామన్ బ్రాండింగ్

తెలంగాణ ముద్ర ఉండేట్లుగా బ్రాండ్ పేరు

మహిళల వస్తువులకు సార్వత్రిక గుర్తింపునకు సెర్ప్ ప్రయత్నాలు

ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబిలింగ్

అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు

త్వరలోనే మహిళా ఉత్పత్తుల కు మహర్దశ

సీఎం కెసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో కొత్త బ్రాండింగ్

సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సమీక్ష

హైదరాబాద్ : త్వరలోనే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండింగ్ ఏర్పాటు కానుంది. తెలంగాణ ముద్ర ఉండేట్లుగా బ్రాండ్ పేరు ఉండనుంది. మహిళల వస్తువులకు సార్వత్రిక గుర్తింపునకు సెర్ప్ (పేదరిక నిర్మూలనా సంస్థ) ప్రయత్నాలు చేస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబిలింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్ కార్డ్ సంస్థ తో ఒప్పందం కాగా, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నిర్ణయించారు.

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయం మంత్రుల నివాసంలో ఈ మేరకు సమీక్షించారు. త్వరలోనే పలు సంస్థలతో ఒప్పందాలు, మహిళా ఉత్పత్తుల కు మార్కెటింగ్ కోసం చేసుకోవాలని మంత్రి చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక మహిళా సంఘాలు స్వయంగా అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కూడా వారు తయారు చేస్తున్న నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల మార్కెటింగ్ పలు విధాలుగా జరుగుతున్నది. ఫ్లిప్ కార్డ్ వంటి సంస్థలతో కూడా ఒప్పందాలు కుదిరాయి. అయితే, తెలంగాణ మహిళల సంఘాలు తయారు చేస్తున్న వస్తువులకు మంచి డిమాండ్ ఉంది.

ఆ డిమాండ్ కు తగ్గట్లుగా, మరింత ఆకర్షణీయంగా లే బిలింగ్, ప్యాకింగ్ చేస్తూ, బ్రాండింగ్ ఏర్పాటు చేస్తే, మన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగి, కొనుగోలు బాగా సాగి, లాభదాయకంగా ఉంటుంది. దీంతో అమెజాన్ వంటి బడా అంతర్జాతీయ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని, మరింతగా వ్యాపారం చేయవచ్చు. ఈ దిశగా ఆలోచిస్తూ తెలంగాణ డ్వాక్రా సంఘాల మహిళల ఉత్పత్తులను మంచి బ్రాండింగ్ చేయాలని వివరించారు.

ఇప్పటికే సీఎం కెసిఆర్ గారి కృషి ఫలితంగా జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు మారుమోగుతోంది. అభివృద్ధి, సంక్షేమంలో మనకు సాటి లేదు. వివిధ పథకాల రూపకల్పన, అమలులో కూడా తిరుగులేదు. మన మహిళా సంఘాల అభివృద్ధి, పొడుపులోను మనమే దేశంలో నెంబర్ వన్ గా ఉన్నాం. ఈ దశలో మన తెలంగాణ పేరు ప్రతిష్ఠలు ఉట్టి పడేలా, మహిళా ఉత్పత్తులను సులువుగా, ఆకర్షణీయంగా అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముడు పోయేలా ఈజీ గా, క్యా చీగా ఉండేట్లుగా బ్రాండింగ్ ఉండాలని మంత్రి సూచించారు.

త్వరలోనే సీఎం కెసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో కొత్త బ్రాండింగ్ చేయాలని, అందుకు తగ్గట్లుగా పలు పేర్లను పరిశీలించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ అధికారులు రజిత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X