तेलंगाना और आंध्र प्रदेश में चुनाव के लिए सबकुछ है तैयार, मगर उस गांव का है यह हाल

तेलंगाना में मतदान शुरू

हैदराबाद: तेलंगाना की 17 और आंध्र प्रदेश में 25 लोकसभा व 175 विधानसभा सीटों पर मतदान शुरू हो गया है। मतदान केन्द्रों के पास मतदाताओं की कतारें लगी रहीं। वोट देने के अपने अधिकार का प्रयोग कर रहे हैं। मतदान 13 मई को सुबह 7 बजे से शाम 5 बजे तक होगा। तेलंगाना के 13 विधानसभा क्षेत्रों में, जो नक्सल प्रभावित क्षेत्र हैं, मतदान शाम 4 बजे तक समाप्त हो जाएगा।

हैदराबाद: तेलंगाना में थोड़ी ही देर में लोकसभा चुनाव आरंभ होंगे। इसके साथ ही पूरे राज्य में मतदान की व्यवस्था की गयी। इसके लिए एक किलोमीटर के अंदर स्थानीय मतदान केंद्र बनाये गये हैं। धूप को देखते हुए सभी सुविधाएं जुटाई गई हैं। इस हद तक मतदाता सोमवार को सुबह सात बजे से शाम पांच बजे तक अपने मताधिकार का प्रयोग करेंगे।

हालाँकि, जिन अधिकारियों ने सभी गाँवों में मतदान केंद्र स्थापित किए हैं, वे वरंगल जिले के दुग्गिंडी मंडल के गिरनीबावी में स्थापित नहीं कर सके। इस गांव में 936 मतदाता हैं। मतदान केन्द्रों के लिए सभी आवश्यकताएं भी है। मगर स्कूल नहीं होने के कारण मतदान केंद्र नहीं बनाया गया।

परिणामस्वरूप, ग्रामीणों को अपने मताधिकार का प्रयोग करने के लिए 2 या 3 किलोमीटर दूर किसी गाँव में जाना पड़ रहा है। इससे ग्रामीण गहरा दुख व्यक्त कर रहे हैं। वे अपने गांव में पोलिंग बूथ बनाने की अधिकारियों से आग्रह कर रहे हैं।

संबंधित खबर-

आंध्र प्रदेश में…

कुछ ही देर में आंध्र प्रदेश में भी मतदान शुरू हो जाएगा। 175 विधानसभा क्षेत्रों और 25 लोकसभा क्षेत्रों में सुबह 7 बजे से शाम 6 बजे तक मतदान होगा। चुनाव आयोग ने इसकी तैयारी पूरी कर ली है। 459 वाहनों से मतदान सामग्री वितरित की गई। इस बार एपी में वाईएसआर कांग्रेस पार्टी और टीडीपी-जनसेना-बीजेपी गठबंधन के बीच कड़ी टक्कर होगी। इससे मतदान प्रतिशत भारी रहने की संभावना है। लोग पहले ही अन्य क्षेत्रों से बड़ी संख्या में अपने-अपने गांव चले गए हैं।

आंध्र प्रदेश में कुल 4.14 करोड़ मतदाता हैं> इनमें से 2.03 करोड़ पुरुष मतदाता और 2.10 करोड़ से अधिक महिला मतदाता हैं। चूंकि राज्य में मतदाताओं में पुरुषों की तुलना में महिलाओं की संख्या अधिक है> इसलिए यह देखना दिलचस्प हो गया है कि महिलाओं का झुकाव किस ओर होगा। कुल 46 हजार 389 मतदान केंद्र बनाये गये हैं। प्रत्येक मतदान केंद्र पर 1500 लोगों को मतदान करने की अनुमति है।

తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధం

హైదరాబాద్ : మరి కాసేపట్లో తెలంగాణలో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌కు ఏర్పాటు చేశారు. ఇందుకోసం స్థానికంగా కిలో మీటర్‌లోపే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండల దృష్ట్యా అన్ని సౌకర్యాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఓటర్లు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

అయితే అన్ని ఊర్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు వరంగల్ జిల్లా దుగ్గిండి మండలం గిర్నిబావిలో మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. ఈ గ్రామంలో 936 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు కావాల్సి అన్ని అర్హతలు ఉన్నాయి. పాఠశాల లేదనే కారణంగా బూత్ ఏర్పాటు చేయలేదు.

దీంతో గ్రామస్తులు 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వస్తుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో

ఆంధ్రప్రదేశ్‌లో మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 459 వాహనాల్లో పోలింగ్ మెటీరియల్‌ను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈసారి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. దీంతో ఓటింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తమ స్వస్థలాలకు తరలి వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 2.03 కోట్ల మంది కాగా.. 2.10 కోట్లకుపైగా మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటంతో.. మహిళా మణులు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 46 వేల 389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉండగా.. కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 15 చొప్పున నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాల్లో 12 నియోజకవర్గాలు ఉండగా.. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 14 చొప్పున స్థానాలు ఉన్నాయి. కడప, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పదేసి నియోజకవర్గాలు ఉండగా.. విజయనగరం జిల్లాలో 9 స్థానాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తోంది. ఈ 14 స్థానాల్లో భద్రతను సైతం పెంచారు. ఇప్పటికే రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. ఆరు రోజులపాటు సాగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో 4.44 లక్షల ఓట్లు పోలయ్యాయని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. మరోవైపు పోలింగ్‌ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ప్రిసైడింగ్‌ అధికారితో పాటుగా కొందరు అధికారులు తప్ప ఎవరూ పోలింగ్‌ బూత్‌లోకి మొబైల్స్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.

మరోవైపు ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్‌శాఖ భద్రతపరంగా తీసుకోవాల్సిన అన్నీ చర్యలు తీసుకుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర పోలీసులకు అదనంగా సీఏ‌పీఎఫ్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సి‌సి కాడేట్స్, కర్ణాటక, తమిళనాడు పోలీసులతో పాటు ఎక్స్ సర్వీస్ సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఇతర విభాగాల సేవలను కూడా వినియోగిస్తున్నట్లు డీజీపీ తెలిపారు.

సివిల్ పోలీసులు – 58,948 ఏపీ స్టేట్ పోలీస్ (Civil+AR+HGs) – 45,960.. కర్ణాటక పోలీసులు – 3500 తమిళనాడు పోలీసులు – 4500.. హోం గార్డ్స్ – 1622.. వివిధ విభాగాలు, Depuration సిబ్బంది – 3366 ఆర్మ్‌డ్ బలగాల విషయానికి వస్తే ఏపీఎస్పీ (ప్లటూన్స్) -92, సీఏ‌పీఎఫ్ (ప్లటూన్స్)- 295 ఇతర బలగాలు – 18609 ఎన్‌సీసీ – 3010 ఎన్‌ఎస్‌ఎస్ – 13739 ఎక్స్ సర్వీస్‌మెన్ – 1614, రిటైర్డ్ పోలీసు సిబ్బంది- 246 మంది ఉన్నారు. సమస్యాత్మకమైన నియోజకవర్గాల్లో అదనపు బలగాలను కూడా మోహరించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. దాదాపు 1,06,145 మంది పోలీసులు, కేంద్ర బలగాలు భద్రతా ఎన్నికల విధుల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. అలాగే 2019 ఎన్నికల్లో 197 కంపెనీల కేంద్ర బలగాలు రాగా ఈసారి ఆ సంఖ్య 295కి పెరిగింది.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X