తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్‌: కూనంనేని సాంబశివరావు

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడానికి, ఓటర్లను భ్రమల్లో పెట్టే బడ్జెట్‌గా సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన బడ్జెట్‌ ఇది.  ఈ బడ్జెట్‌ దారిద్య్రరేఖకు దిగువనున్నవారికి ప్రయోజనం కల్పించే బడ్జెట్‌ కాదని సీపీఐ(ఎం) స్పష్టం చేస్తున్నది.

గత బడ్జెట్‌ రు.45లక్షల కోట్లు కాగా, 2024-25 సంవత్సరానికి రు.47.6 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ గత బడ్జెట్లల్లో దేశంలో 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ నుండి ఎగువకు తెచ్చామని చెబుతూనే, మరోవైపున దారిద్య్రరేఖలో మగ్గుతున్న వారికి రానున్న ఐదేళ్ళు ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం సరఫరా చేస్తానని ప్రకటించారు. పేదలు, యువకులు, మహిళలు, రైతులే ప్రధాన లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పినప్పటికీ  పేదల పరిస్థితి మరింత దిగజారుతున్నది. ఉపాధిహామీ నిధులు 2022-23లో రు.91వేల కోట్లు వ్యయం చేయగా, 2024-25లో రు.86వేల కోట్లకు, ఆహార సబ్సిడీ రు.3లక్షల కోట్ల నుండి రు.2.63 లక్షల కోట్లకు, ఎరువుల సబ్సిడీని రు.2.55 లక్షల కోట్ల నుండి రు.1.68 లక్షల కోట్లకు తగ్గించారు. కేంద్రం ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ,  మరోవైపున సబ్సిడీలకు కోత పెడుతున్నది.  నిరుద్యోగం, ఆరోగ్యం తదితర సమస్యలను ప్రస్తావించకుండా రామమందిరం నిర్మాణం ద్వారా రానున్న కాలంలో దేశం అభివృద్ధిలోకి వస్తుందని, 2047 నాటికి దేశంలో దారిద్య్రం పూర్తిగా నిర్మూలించబడుతుందని ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌లో ప్రకటించడం ప్రజలను మోసం చేయడమే.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామాన్‌ ప్రవేశ పెట్టిన ఓటాన్‌ అన్‌ అకౌంట్‌ బడ్జెల్‌లో తెలంగాణకు మొండి చెయ్యి చూపిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ విభజన సందర్భంగా పొందుపర్చిన బయ్యారం ఉక్కుప్యాక్టరీ ఊసే లేదని పేర్కొన్నారు. వరంగల్‌ కోచ్‌ ప్యాక్టరీని ప్రారంభించకుండా యాక్సిల్‌ అండ్‌ వీల్‌ అనే పరిశ్రమను స్థాపిస్తామని చెప్పి కండి తుడుపు చర్యలకు ప్రయత్నిస్తున్నారని, వాటికి నిధులు కేటాయించలేదని అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించలేదని, ఇప్పుడు పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ప్రకటించకపోవడంతో తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూపుతున్నదని వారన్నారు. కేంద్రం తీసుకొచ్చిన పంటల మద్దతు ధర గ్యారెంటీ చట్టం, విద్యుత్‌ సవరణ చట్టం2022 రద్దు, రుణమాఫీ తదితర అంశాలపట్ల ఢల్లీిలో 13 నెలల పాటు ఆందోళన చేసిన రైతులకు తాత్కాలిక ఉపశమనం కల్పించి నేడు బడ్జెట్‌లో వారికి సంబంధించిన కేటాయింపు లేకపోవడం నమ్మించి మోసం చేయడమే అవుతున్నదని కూనంనేని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకం ఉన్నా సామాన్యరైతులకు చేరడం లేదని, దానికి కూడా బడ్జెట్‌లో కోత విధించారని అన్నారు. పేదరికం నుండి 250 మిలియన్ల ప్రజలను తీసుకొచ్చామని చెప్పడం హాస్యాస్పదమని, పదేళ్ళలో ఒక ఇళ్ళు కూడా ఇవ్వని కేంద్రం నేడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అర్హులైనవారందరికి ఇండ్ల కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. స్వయం సహాయక మహిళలకు సహాయం చేయలేదని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇది ముమ్మాటికి ఎన్నికల బడ్జెట్‌గానే ఉన్నదని వారన్నారు.

వైరుధ్యాల బడ్జెట్‌

ఒకవైపు 2041 వరకు పేదరికం కనపడకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్రం తాజా బడ్జెట్‌లో దానికి విరుద్దంగా వ్యవహరించిందని సాంబశివరావు అన్నారు. గతంలో కార్పోరేట్‌ ట్యాక్సీలు భారీ తగ్గించి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి ఇచ్చే సబ్సిడీలను భారీగా కోత విధించారని విమర్శించారు. గత బడ్జెట్‌లో ఆహార, ఎరువులు, పెట్రోలియం సబ్సిడీలో 4.13 లక్షల కోట్లు కేటాయించగా వచ్చే బడ్జెట్‌లో 3.70 లక్షల కోట్లు మాత్రమే కేటాయించడమేంటే రూ. 43 వేల కోట్లు కోత విధించారని మండిపడ్డారు. పేదరికం తగ్గించడమంటే ఇదేనా అని నిలదీశారు. రెండేళ్ళ క్రింద ఉపాధి హామీ పథకానికి రూ. 90,860 కోట్లు కేటాయించి, వచ్చే రూ. 86 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. అప్పులు సైతం విపరీతంగా పెరిగాయని, భారతదేశ అప్పులు రూ. 168.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని, గత బడ్జెట్‌ కంటే 16 లక్షల కోట్లు అధికమని అన్నారు. ఒకవైపు ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్భణం, నిరుద్యోగిత రేటు పెరుగుతుంటే అందుకు విరుగుడు చర్యలు కాకుండా సబ్సిడీలపై, ఉపాధి హామీపై కోత విధించడమంటే వైరుధ్యాల బడ్జెట్‌ అన్నారు

(తమ్మినేని వీరభద్రం)

CPI(M) రాష్ట్ర కార్యదర్శి

————————————

ప్రజాకర్షక పథకాల కంటే.. అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట అమృతకాలంలో వికసిత భారత లక్ష్యాలకు రాచబాట
2024 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఈ బడ్జెట్ గతపదేళ్లలో మోదీ ప్రభుత్వం GYAN నినాదంతో (G-గరీబ్ కల్యాణ్ – పేదల సంక్షేమం, Y- యూత్ – యువత సాధికారత, A- అగ్రికల్చర్ – వ్యవసాయం, N-నారీశక్తి సాధికారత) పనిచేసింది.దీని ఫలితంగానే.. పేదరికం గణనీయంగా తగ్గడంతోపాటుగా.. వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమైంది.

వికసిత భారత సంకల్ప లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబించింది. అమృత్ కాల్ (వచ్చే 25 ఏళ్ల సమయం)లో భారతదేశం సాధించాల్సిన ప్రగతిని నిర్దేశించుకుని.. వాటిని చేరుకునేందుకు ఏయే రంగాల్లో దృష్టి సారించాలో తెలియజేసేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో పాపులిస్టిక్ (ప్రజాకర్షక పథకాలు) బడ్జెట్ కాకుండా.. దేశ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్ ఇది.

మౌలిక వసతుల రంగానికి భారీ ప్రోత్సాహం

దేశంలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన ద్వారా.. అభివృద్ధికి బాటలు వేయాలనే సంకల్పంతో కేంద్రం పనిచేస్తోంది. ఇందులో భాగంగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ.. మౌలిక వసతుల రంగంపై చేయాల్సిన వ్యయాన్ని 11.1% పెంచింది. ఈ మొత్తం 11.11 లక్షల కోట్లు.

పునరుత్పాదక విద్యుత్

సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో.. ఇళ్ల పైకప్పులపై.. సోలార్ ప్యానెళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియకు ఈ బడ్జెట్ లో శ్రీకారం చుట్టారు. కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా.. ప్రతి నెలా ఒక్కో ఇంటినుంచి 300 యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో పనిచేయనున్నారు.

పేదలు, మధ్యతరగతికి మద్దతుగా

మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కిరాయి ఇళ్లలోనే ఉంటున్నారని గుర్తించి.. వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రుణసదుపాయం కల్పించనున్నారు.

దీంతోపాటుగా ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజనలో భాగంగా నిర్దేశించుకున్న 3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకున్నందున.. మరో 2 కోట్ల ఇళ్లను వచ్చే ఐదేళ్లలో నిర్మించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట

దేశవ్యాప్తంగా 83 లక్షల స్వయం సహాయక బృందాల్లోని 9 కోట్ల మంది మహిళలు.. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక-ఆర్థిక ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచి కనీసం 2 కోట్ల మందిని లక్షాధికారులుగా చేయాలన్న టార్గెట్‌ను 3 కోట్లకు పెంచారు. తద్వారా మహిళాసాధికారతను మరో మెట్టు పెంచనున్నారు.

పర్యాటకానికి ఊతం

ప్రఖ్యాత పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి చేయడంతోపాటుగా.. వాటిని అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేయడంపైనా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల్లో పోటీ తత్వాన్ని పెంచి వారిని ప్రోత్సహించనున్నారు. దీంతోపాటుగా లక్షద్వీప్ వంటి ద్వీపప్రాంతాల్లో పర్యాటక మౌలిక వసతుల కల్పన కు పెద్దపీట వేస్తూ.. ఆయా ప్రాంతాలకు అనుసంధానత (కనెక్టివిటీ) పెరిగేలా చర్యలు తీసుకోనున్నారు.
40వేల సాధారణ రైలు బోగాలను వందేభా రత్ ప్రమాణాలతో ఆధునీకరించనున్నారు.

పన్నుల సంస్కరణలు

2009-10 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్నటువంటి రూ.25వేల వరకు ఔట్‌స్టాండింగ్ డైరెక్ట్ టాక్స్ డిమాండ్స్, 2010-11 నుంచి 2014-15 వరకు ఉన్నటువంటి రూ.10వేల ఔట్‌స్టాండింగ్ డైరెక్ట్ టాక్స్ డిమాండ్స్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. దీని వల్ల కోటి మంది పన్ను చెల్లింపుదారులకు మేలు జరగనుంది.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు ఆరోగ్య సంరక్షణ

ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిని ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లకు అందించనున్నారు. దీంతోపాటుగా 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు గల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ అందించనున్నారు.

ఇలాంటి కార్యక్రమాలను ప్రకటించడం ద్వారా.. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాల కంటే.. దేశ సమగ్రాభివృద్ధికి, ప్రజల సంపూర్ణ సంక్షేమానికి బాటలు వేస్తుందని మరోసారి సుస్పష్టమైంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X