हैदराबाद: ग्रेटर में जीएचएमसी के शौचालयों की रखरखाव ठीक नहीं होने के कारण उपयोग करने योग्य नहीं है। इन शौचालयों में पानी ठीक से नहीं आने, समय-समय पर सफाई नहीं करने, टूटे फूटे दरवाजे होने के कारण महिलाएं शौचालयों में जाने से कतरा रही हैं।
विभिन्न कार्यों के लिए घर से बाहर निकलने वाली महिलाएं इन शौचालयों में जाने की स्थिति में नहीं है। वे चिंतित हैं कि यदि आपातकालीन स्थितियों में उनका उपयोग करने पर बीमार होने की अधिक संभावना है। कुछ महिलाओं का कहना है कि आपातकालीन स्थिति यानी मासिक धर्म के समय शॉपिंग मॉल और रेस्तरां में भागती हैं।
महिलाओं का यह भी कहना है कि केंद्र सरकार की मदद से शहर में यहां-वहां स्थापित किए गए इलेक्ट्रिक मोबाइल शौचालय उपयोगी हैं। महिलाएं और सामाजिक कार्यकर्ता पूरे शहर में इस प्रकार के इलेक्ट्रिक मोबाइल शौचालय स्थापित करने का सरकार से आग्रह कर रही हैं।
నగరంలో 12 చోట్లనే ఎలక్ట్రిక్ మొబైల్ షీ టాయిలెట్లు
Hydrabad : గ్రేటర్‌వ్యాప్తంగా ఉన్న జీహెచ్ఎంసీ షీ టాయిలెట్లు మెయింటెన్స్ సరిగా లేక అధ్వానంగా తయారయ్యాయి. నీళ్లు రాక, ఎప్పటికప్పుడు క్లీన్ చేయక, డోర్లు ఊడిపోయి ఇలా ఒక్కోచోట ఒక్కో రకంగా ఉన్నాయి. వివిధ పనుల మీద ఇంటి నుంచి బయటకు వచ్చే మహిళలు వాటిలోకి వెళ్లే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించినా లేనిపోని రోగాలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. మెన్సస్ టైంలో ఏదోక షాపింగ్మాల్కో, రెస్టారెంట్లకో పరుగులు పెడుతున్నామని కొందరు చెబుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో సిటీలో అక్కడకక్కడ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ మొబైల్ షీ టాయిలెట్స్ మాత్రం ఉపయోగకరంగా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటివి సిటీ వ్యాప్తంగా ఇంకా ఏర్పాటు చేయాలని మహిళలు, సోషల్ యాక్టివిస్ట్‌లు కోరుతున్నారు.
స్వచ్ఛభారత్‌లో భాగంగా జీహెచ్ఎంసీ గతంలో సిటీ వ్యాప్తంగా మహిళల కోసం షీ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వాటి నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి చేతులు దులుపుకుంది. పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడ దారుణంగా తయారయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర టాయిలెట్లు లేవు. ఉన్నచోట ఉపయోగపడట్లేదు. విదేశాల్లో ప్రతి 2 కి.మీ.కు ఒక పబ్లిక్ రెస్ట్ రూం ఉంటుందని, అదేవిధంగా సిటీలోనూ ఏర్పాటు చేయాలని మహిళా యాక్టివిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, అంతసేపు ఉగ్గబట్టుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చాలా మంది వాపోతున్నారు. కొత్తవి ఏర్పాటు చేయడంతోపాటు ఉన్నవాటిని మంచిగా మెయింటెన్ చేయాలని కోరుతున్నారు.
మెట్రో నగరాలకు సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద కేంద్ర హోంశాఖ నిర్భయ ఫండ్స్ ఇస్తోంది. వాటితో జీహెచ్ఎంసీ ఆరు జోన్లలో ‘ఎలక్ట్రిక్ మొబైల్ షీ టాయిలెట్స్’ ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ జోన్‌లో 3 వెహికల్స్, ఎల్బీనగర్లో 3, ఖైరతాబాద్‌లో 2, చార్మినార్‌లో 2, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో ఒకటి చొప్పున అందుబాటులో ఉంచారు. ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్ బండ్, ప్రగతి భవన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అసెంబ్లీ, గచ్చిబౌలి జంక్షన్, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో ఇండియన్, వెస్ట్రన్ మోడల్స్‌లో టాయిలెట్ సీటింగ్ ఉంటుంది. వ్యర్థాలను మున్సిపల్ సీవరేజీ ట్యాంక్‌కు అనుసంధానం చేశారు. బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్, మడత కుర్చీ, చిన్నారులకు డైపర్ మార్చేందుకు టేబుల్ వంటివి అమర్చారు. లాకర్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. వెహికల్ దగ్గర లేడీ వర్కర్ అందుబాటులో ఉన్నారు. అయితే ఇవి కేవలం రద్దీ, పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. (Agencies)