हैदराबाद: तेलंगाना सरकार ने वाहन चालकों को एक बड़ी खुशखबरी दी है। गाड़ियों पर दर्ज पेंडिंग चालान पर छूट का ऐलान किया गया है। आरटीसी बसों और बंडी (साइकिल के चार पहिए के जरिए काम करने वाले छोटे-छोटे व्यापारी) में पेंडिंग चालान पर 90 फीसदी की छूट दी है।
दो पहिया वाहनों के लिए 80 प्रतिशत और चार पहिया वाहनों और ऑटो के लिए 60 प्रतिशत की छूट की घोषणा की गई है। भारी वाहनों पर 50 फीसदी की छूट दी गई है।
सरकार ने कहा कि लंबित चालान का भुगतान चालान वेबसाइट के माध्यम से इस महीने की 26 तारीख से अगले महीने (जनवरी) की 10 तारीख तक किया जा सकता है। इस बीच, राज्य में वाहनों पर बड़ी संख्या में लंबित चालान के कारण पुलिस विभाग ने यह निर्णय लिया।
मालूम हो कि सरकार पहले भी पेंडिंग चालान पर छूट की घोषणा कर भारी राजस्व प्राप्त कर चुकी है। पिछले दिनों जब पेंडिंग चालान पर छूट की घोषणा की गई तो सरकार को जनता से अच्छा रिस्पॉन्स मिला और एक बार फिर ऐसा फैसला लिया।
వాహనదారులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్
హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలపై నమోదైన పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై ఉన్న పెండింగ్ చలాన్లకు 90 శాతం డిస్కౌంట్ ఇచ్చింది.
టూ వీలర్స్‌కు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం రాయితీ ప్రకటించింది. భారీ వాహనాలకు 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లను ఈ నెల 26 తేదీ నుండి వచ్చే నెల (జనవరి) 10వ తేదీ వరకు ఈ చలాన్ వెబ్ సైట్ ద్వారా చెల్లించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
కాగా, రాష్ట్రంలోని వాహనాలపై చలాన్ల పెద్దఎత్తున పెండింగ్‌లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.
పెండింగ్ చలాన్లపై గతంలో డిస్కౌంట్ ప్రకటించినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన రావడంతో ప్రభుత్వం మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. (ఏజెన్సీలు)