హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ మల్లారెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని హైదరాబాద్ LB స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పాస్టర్లు హైదరాబాద్ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు
