मुख्यमंत्री रेवंत रेड्डी हो गये अस्वस्थ, डॉक्टर कर रहे हैं आरटीपीसीआर टेस्ट, महाराष्ट्र के कृषि मंत्री पॉजिटिव

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी अस्वस्थ हो गये हैं। वह बुखार से पीड़ित है। फिलहाल खबर है कि जुबली हिल्स स्थित उनके आवास पर डॉक्टर मेडिकल जांच के साथ-साथ आरटीपीसीआर टेस्ट भी कर रहे है।

गौरतलब है कि देश में कोरोना के नए वेरिएंट के मामले लगातार बढ़ते जा रहे हैं। जेएन-1 नामक एक नया संस्करण धीरे-धीरे फैल रहा है। इसी क्रम में सीएम रेवंत रेड्डी की अचानक बीमारी से हर कोई चिंतित है।

बताया गया है कि सर्दी, खांसी और बुखार होने पर कोविड टेस्ट किया जा रहा है। अगर सीएम कोरोना पॉजिटिव पाए जाते हैं तो हाल ही में उनके साथ समीक्षा में शामिल हुए मंत्रियों और अधिकारियों का भी टेस्ट किया जाएगा।

महाराष्ट्र के कृषि मंत्री कोरोना पॉजिटिव

एक बार फिर देशभर में अपने पैर पसार रही कोरोना महामारी नेताओं का पीछा नहीं छोड़ रही है। हाल ही में महाराष्ट्र के कृषि मंत्री धनंजय मुंडे कोरोना पॉजिटिव पाए गए हैं। यह बात राज्य के उपमुख्यमंत्री अजित पवार ने कही। उन्होंने पत्रकारों से यह भी कहा कि वायरल संक्रमण से डरने की जरूरत नहीं है।

इस महीने की 21 तारीख को वह बीमार पड़ गये और घर से ही कार्यक्रम में हिस्सा ले रहे हैं। वह अब पूरी तरह स्वस्थ हैं। सावधानी बरतने के कारण उनके साथियों में कोई संक्रमण नहीं फैला है। उपमुख्यमंत्री पवार ने मीडिया को बताया कि फिलहाल मंत्री धनंजय डॉक्टरों की सलाह के मुताबिक कई एहतियाती कदम उठा रहे हैं।

CM రేవంత్ రెడ్డికి అస్వస్థత, కొవిడ్ టెస్టులు చేస్తున్న వైద్యులు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జేఎన్-1 అనే న్యూ వేరియంట్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సడన్‌గా అనారోగ్యం బారినపడటం ప్రజలను, కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.

జలుబు, దగ్గు, జ్వరం రావడంతో కొవిడ్ టెస్టులు చేస్తున్నట్లు సమాచారం. ఒక వేళ సీఎంకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఇటీవల ఆయనతో సమీక్షలో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా టెస్టులు చేయించుకోనున్నారు.

మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కరోనా పాజిటివ్‌

మరోసారి దేశ వ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. రాజకీయ నాయకులను వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనిని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆయన విలేకరులతో అన్నారు.

ఈ నెల 21న అస్వస్థతకు గురైన అతను ఇంటి వద్ద నుంచే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో అతనితో ఉన్నవారికి ఎటువంటి వ్యాప్తి జరగలేదు. ప్రస్తుతం మంత్రి ధనంజయ్ డాక్టర్ల సూచన మేరకు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి పవార్ మీడియాతో తెలిపారు.

దేశంలో కొవిడ్‌ కేసులు

మరోవైపు, దేశంలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 312 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,742 నుంచి 4,054కు పెరిగింది.

ఇక తాజా కేసుల్లో అత్యధికంగా కేరళలో 128 కేసులు వెలుగుచూశాయి. నిన్న ఒక్క రోజే ఒక మరణం నమోదైంది. దీంతో మొత్తం కొవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,33కి చేరింది. ఇక 24 గంటల్లో 315 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,71,860) చేరుకుంది.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని థానేలో తాజాగా 5 కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు నమోదయ్యాయి. నవంబర్‌ 30 నుంచి 20 నమూనాలను పరీక్షించగా థానే నగరంలో ఐదు JN.1 వేరియంట్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం నగరంలో క్రియాశీల కేసుల సంఖ్య 28కి పెరిగింది. వారిలో ఇద్దరు ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారు వారి ఇళ్లలో కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డానికి కొత్త వేరియంట్ జేఎన్‌.1 (JN.1) కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X