రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం

హైదరాబాద్ : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, సీఎం రేవంత్, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సంతాపం తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఇవాళ ఉదయం ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ప్రధాని మోదీ

రామోజీ రావు గారు మరణించడం చాలా బాధాకరం. అతను భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. అతని గొప్ప రచనలు జర్నలిజం, చలనచిత్ర పరిశ్రమ,మీడియాపై చెరగని ముద్ర వేసాయి. రామోజీ రావు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా మక్కువ చూపేవారు. రామోజీరావుతో మాట్లాడే అకాశం ఎన్నో సార్లు దక్కింది.మీడియా రంగంలో, సినీ రంగంలో రామోజీ సేవలు మరువలేనివన్నారు ప్రధాని మోదీ. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢసానుభూతి అని మోదీ ట్వీట్ చేశారు.

ఇది కూడ చదవండి-

రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప

హైదరాబాద్ : తెలుగు పత్రికా దిగ్గజం, ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు.

తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందన్నారు. రామోజీరావు గారు తెలుగువారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తిగా సీఎం కొనియాడారు. రంగం ఏదైనా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు అన్నారు. పత్రిక నిర్వహణ ఒక సవాల్ అనుకునే పరిస్థితుల్లో ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నెంబర్ వన్ స్థానంలో నడపడం, ఈటీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశాదిశా చూపిన దార్శనికుడు రామోజీరావు అని సీఎం అన్నారు.

ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో భేటీ ఐన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగుర్తు చేసుకున్నారు. రామోజీరావు లేని లోటు తెలుగు మీడియా రంగానికి, వ్యాపార రంగానికి తీరని లోటు అని సీఎం అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

G NIRANJAN TPCC Sr Vice-President & Chairman, Election Commission Coordination Committee

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణము తెలుగు ప్రజలకు తీరని లోటు

ఈనాడు దినపత్రిక ద్వారా పత్రికా రంగంలో ఒక సంచలనం సృష్టించారు. మారుమూలలో కూడా వార్తల సేకరణకు విలేకరులను నియమించడము ద్వారా స్థానిక వార్తలకు ప్రాధాన్యం కలిగించారు. ఆయన నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అద్భుతము. ఆయన ప్రవేశించిన ప్రతి రంగంలో విజయం సాధించి తన కంటూ ఒక స్థానాన్ని సుస్థిర పరుచుకున్నారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని, ఆయన కుటుంబానికి ఈ లోటును తట్టుకునే శక్తి నివ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

Ramoji Rao’s death is a great loss for the Telugu people

A sensation has been created in the field of journalism through Eendu daily. Priority was given to local news by appointing reporters to gather news even in remote areas. Ramoji Film City created by him was a marvel that caught the attention of the whole world. He succeeded in every field he entered and established a place for himself. Condoling his death, I pray to God to grant peace to his soul and strength to his family to bear this loss.

చంద్రబాబు

రామోజీ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు చంద్రబాబు. తిరిగి కోలుకుంటారని అనుకున్నా కానీ..ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. రామోజీ మరణం రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటన్నారు.
సీఎం రేవంత్

తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

కేసీఆర్

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
చిరంజీవి

ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివి కేగింది..ఓం శాంతి అని చిరంజీవి ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్

అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను వేదికగా చేశారు. ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు పవన్.

జూ.ఎన్టీఆర్

రామోజీ రావు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత , భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

వెంకయ్యనాయుడు

మీడియా దిగ్గజం రామోజీరావుకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు ‘రామోజీ రావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం’ అని వెంకయ్య నాయుడు Xలో పోస్ట్ చేశారు.

రామోజీరావు మరణం పట్ల సంతాపం ప్రకటించిన మధుయాష్కి గౌడ్

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. “పత్రికా, మీడియా రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారు. జర్నలిజంలో నూతన ఒరవడి కి బాటలు వేసి.. అందరూ అనుసరించేలా మార్గదర్శి అయ్యారు. అనేక సంస్థలను స్థాపించి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వాటిని విజయాల బాటలో నడిపించడం.. రామోజీరావు క్రమశిక్షణ, నిబద్ధతకు నిదర్శనం” అని మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి

మీడియా మొగల్, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మృతి పట్ల నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు..ఆయన బహుముఖ ప్రజ్జ శాలి అని, అనేక రంగాలలో తన ప్రతిభను చాటుకున్న మహనీయులు అని అన్నారు. ఆయన మరణం తెలుగు ప్రజానీకానికి తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. రామోజీ రావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించనున్న కాంగ్రెస్ నాయకులు. ఉదయం 11 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావు కు నివాళులు అర్పించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ తదితరులు.

డాక్టర్ కే లక్ష్మణ్

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు నేడు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈనాడు పేపర్ నేడు తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన పత్రిక. ఆ పత్రిక ద్వారా తెలుగు ప్రజలను మేల్కొల్పిన వ్యక్తి. మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్న వ్యక్తి. పత్రికా రంగంలో ఎవరికి తలవంచకుండా తనదైన శైలిలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన వ్యక్తి. జర్నలిజానికి మారుపేరుగా రూపొందించారు. క్రమశిక్షణ, ప్రజలతో సత్సంబంధాలు నేర్పిన వ్యక్తి. ఫిలిం సిటీ స్థాపించి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు నిర్మించే విధంగా ఫిలిం సిటీని రూపొందించారు.

ఈటీవీ న్యూస్ చానల్స్ ను, ఎంటర్టైన్మెంట్, ఆధ్యాత్మిక ఛానల్ ను ప్రారంభించడంతోపాటు సినిమా రంగంలో ప్రజలను చైతన్యపరిచేటువంటి సినిమాలు తీసుకురావడం ద్వారా సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ప్రదర్శించారు. వారి మరణం జర్నలిజానికి, పత్రిక రంగానికి, సినిమా రంగానికి ఆధ్యాత్మిక రంగాలకు తీరని లోటు. రామోజీరావు మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.

జి.కిషన్ రెడ్డి సంతాప సందేశం

తెలుగు మీడియా మేరునగధీరుడు, వ్యాపారవేత్త, ప్రఖ్యాత సినీ నిర్మాత, పద్మవిభూషణ్ శ్రీ చెరుకూరి రామోజీరావు గారు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.చిత్తశుద్ధి, అంకితభావంతో కష్టించి పనిచేస్తే.. ఏదైనా సాధించవచ్చు అని చెప్పేందుకు రామోజీరావు గారి జీవితం మన కళ్లముందున్న చక్కటి ఉదాహరణ. తెలుగు పత్రికారంగంలో ‘ఈనాడు’ ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. జాతీయ, అంతర్జాతీయ వార్తలతోపాటుగా స్థానిక వార్తలకు, గ్రామీణప్రాంతాల్లోని ప్రజల సమస్యలకు సరైన ప్రాధాన్యత కల్పిస్తూ.. ప్రభుత్వాలకు చేరవేయడం ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు.

తెలుగు జర్నలిజాన్ని జాతీయస్థాయికి తీసుకొచ్చి.. దేశ చరిత్రలో మొదటిసారిగా ఈటీవీ న్యూస్‌ను.. వివిధ భాషల్లో అందించి.. తెలుగోడి సత్తాను చాటారు. ఒక్కమాటలో చెప్పాలంటే జర్నలిజానికి ఓ గొప్ప గుర్తింపును కల్పించిన మహనీయుడు వారు. దీంతోపాటుగా సమాజంలోని వివిధ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు.. వారు చేసిన కృషి చిరస్మరణీయం. అన్నదాత ద్వారా రైతుల్లో చైతన్యం, వసుంధర ద్వారా మహిళల్లో ఆత్మస్థైర్యం తీసుకురావడం వంటి ఎన్నో చారిత్రక మార్పులకు రామోజీరావు గారే ఆద్యులు.

తెలుగు రుచులను ‘ప్రియ’ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి.. ప్రత్యేక గుర్తింపును పొందారు. ‘సక్సెస్’నే ఇంటి పేరుగా మార్చుకుని.. చేపట్టిన ప్రతి వ్యాపారంలోనూ చక్కటి విజయాలు సాధించారు.

తెలుగు బుల్లితెరపై.. రామోజీరావుగారి ముద్ర సుస్పష్టం. ఈటీవీ ద్వారా ఎందరోమంది కొత్త కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ చిన్న బడ్జెట్ సినిమాలతో కొత్త నటులను పరిచయం చేసి వారికి స్టార్‌డమ్ అందించారు.

వారు రాసిన ప్రతి అక్షరం, వేసిన ప్రతి అడుగూ తెలుగుదనమే. ‘తెలుగు వెలుగు’కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మహనీయుడు ఇకలేరనే వార్త తెలుగుజాతికే తీరని లోటు. రామోజీగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు, ఈనాడు గ్రూపులో పనిచేస్తున్న ఉద్యోగులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

బండి సంజయ్

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం. పత్రికా రంగంలో తనదైన పంథాతో చెరగని ముద్ర వేయడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు వరకు విశ్రమించని యోధుడు. మీడియా, వ్యాపార, సినీ రంగాల్లో అత్యద్బుతంగా రాణిస్తూ ఎంతో మందికి ’మార్గదర్శి’గా నిలిచిన మహనీయుడు.

మీడియా మొఘల్ గా పేరుగాంచిన రామోజీరావుగారిని కలిసినప్పుడల్లా ఎన్నో గొప్ప విషయాలు చెప్పేవారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయనతో కలిసి ‘చంద్రయాన్’ను వీక్షించడం మర్చిపోలేని అనుభూతి. తనలాంటి ఎందరికో మార్గదర్శిగా నిలిచిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ప్రపంచంలోనే అత్యద్బుతమైన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.

మాతృభాష పరిరక్షణకు నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి. మీడియా, చిట్ ఫండ్, ఫిల్మ్ సిటీ సహా అడుగుపెట్టిన ప్రతి వ్యాపార రంగంలోనూ అద్బుతంగా రాణిస్తూ తనదైన ముద్రవేసిన రామోజీరావు ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. అలాంటి వ్యక్తి మరణం తీరనిలోటు. రామోజీరావు గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ముందుకుసాగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X