राष्ट्रपति का देश के नाम संदेश, कहा- “गरीबी रेखा से नीचे रहने वाले लोगों की संख्या में आई है भारी कमी”

हैदराबाद : स्वतंत्रता दिवस की पूर्व संध्या पर राष्ट्रपति द्रौपदी मुर्मू ने देशवासियों को संबोधित किया। सबसे पहले उन्होंने देशवासियों को स्वतन्त्रता दिवस की शुभकामनाएं दीं। राष्ट्रपति ने कहा, “सभी देशवासी 78वें स्वतन्त्रता दिवस का उत्सव मनाने की तैयारी कर रहे हैं, यह देखकर मुझे बहुत खुशी हो रही है। स्वाधीनता दिवस के अवसर पर लहराते हुए तिरंगे को देखना – चाहे वह लाल किले पर हो, राज्यों की राजधानियों में हो या हमारे आस-पास हो-हमारे हृदय को उत्साह से भर देता है।”

राष्ट्रपति ने आगे कहा, “आज, 14 अगस्त को, हमारा देश विभाजन विभीषिका स्मृति दिवस मना रहा है। यह विभाजन की भयावहता को याद करने का दिन है। जब हमारे महान राष्ट्र का विभाजन हुआ, तब लाखों लोगों को मजबूरन पलायन करना पड़ा। लाखों लोगों को अपनी जान गंवानी पड़ी। स्वतंत्रता दिवस मनाने से एक दिन पहले, हम उस अभूतपूर्व मानवीय त्रासदी को याद करते हैं और उन परिवारों के साथ एक-जुट होकर खड़े होते हैं जो छिन्न-भिन्न कर दिए गए थे। आजादी का यह पर्व हमें उन दिनों की याद दिलाता है, जब देश के लिए कई लोगों ने बलिदान दिया। हमारे स्वाधीनता संग्रमियों ने हमें नई अभिव्यक्ति प्रदान की। सरदार पटेल, बोस, भगत सिंह, बाबा साहेब आंबेडकर जैसे कई अन्य लोग थे, जिनके बलिदान की सराहना होती रही है।”

राष्ट्रपति मुर्मू ने कहा, “वर्ष 2021 से वर्ष 2024 के बीच 8 प्रतिशत की औसत वार्षिक वृद्धि दर हासिल कर, भारत सबसे तेज गति से बढ़ने वाली बड़ी अर्थ-व्यवस्थाओं में शामिल है। इससे न केवल देशवासियों के हाथों में अधिक पैसा आया है, बल्कि गरीबी रेखा से नीचे रहने वाले लोगों की संख्या में भी भारी कमी आई है। यह हम सभी के लिए गर्व की बात है कि भारत दुनिया की पांचवीं सबसे बड़ी अर्थव्यवस्था बन गया है, और हम शीघ्र ही विश्व की तीन शीर्षस्थ अर्थ-व्यवस्थाओं में स्थान प्राप्त करने के लिए तैयार हैं। यह सफलता किसानों और श्रमिकों की अथक मेहनत, नीति-निर्माताओं और उद्यमियों की दूरगामी सोच तथा देश के दूरदर्शी नेतृत्व के बल पर ही संभव हो सकी है।”

यह भी पढ़ें-

राष्ट्रपति ने कहा, “हमारे अन्नदाता किसानों ने उम्मीदों से बेहतर कृषि उत्पादन सुनिश्चित किया है। ऐसा करके, उन्होंने भारत को कृषि-क्षेत्र में आत्मनिर्भर बनाने और हमारे देशवासियों को भोजन उपलब्ध कराने में अमूल्य योगदान दिया है। जी-20 की अपनी अध्यक्षता के सफलतापूर्वक सम्पन्न होने के बाद, भारत ने वैश्विक दक्षिण को मुखर अभिव्यक्ति देने वाले देश के रूप में अपनी भूमिका को मजबूत बनाया है। भारत अपनी प्रभावशाली स्थिति का उपयोग विश्व शांति और समृद्धि के विस्तार हेतु करना चाहता है।” (एजेंसियां)

రాష్ట్రపతి ముర్ము స్వాతంత్య్ర దినోత్సవ సందేశం

హైదరాబాద్ : భారత ప్రభుత్వం సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన పురోగతిని సాధించిందని, ఇది సామాజిక ప్రజాస్వామ్యం ముందడుగును ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు. దేశం భిన్నత్వంలో ఏకత్వంతో ముందుకు సాగుతోందని, ఒక సంఘటిత శక్తిగా ముందుకు సాగుతోందని చెప్పారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అనేక చర్యలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రాత్రి ప్రసంగించారు. ‘‘ఆగస్టు 14వ తేదీ దేశ విభజన నాటి పీడకలను స్మరించుకునే రోజు ఇది. విభజన సమయంలో వేలాది మంది దేశం విడిచివెళ్లారు. ఈక్రమంలో జరిగిన అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాటి విషాదాన్ని స్ఫురణకు వస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. విశాలమైన భారత దేశంలో, సామాజిక అంతరాల ఆధారంగా అసమ్మతిని రేకెత్తించే ధోరణులను తిరస్కరించాల్సి ఉంటుందని తాను గట్టిగా నమ్ముతున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళిగా కొత్త క్రిమినల్ చట్టాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చిందన్నారు. 2020లో ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టిందని ఆమె చెప్పారు.

పేదల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ప్రధానమంత్రి సామాజిక ఉత్థాన్, రోజ్ గార్ ఆధారిత్ జనకళ్యాణ్ (పీఎం సురాజ్), ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్) సహా అట్టడుగు వర్గాల కోసం తీసుకొచ్చిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ముర్ము వివరించారు. గిరిజనుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన ప్రభుత్వ స్కీమ్‌లను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయా పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాల వల్లే దేశంలోని కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదకర పనుల్లో పాల్గొనకుండా చూసుకోవడం, వ్యర్థాలను మానవులు తొలగించకుండా రక్షించేందుకు తీసుకొచ్చిన నమస్తే పథకం గురించి వివరించారు. ‘‘భారతీయ సమాజంలో మహిళలను సమానంగా చూస్తున్నప్పటికీ, సంప్రదాయపరమైన పక్షపాతాలు కొనసాగుతున్నాయి. గత దశాబ్ద కాలంలో మహిళా సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచాం. అన్ని రంగాల్లో మహిళా కార్మికులు, ఉద్యోగుల భాగస్వామ్యాన్ని పెంచాం. మెరుగైన లింగ నిష్పత్తికి బాటలు వేశాం. మహిళా సాధికారత కోసం మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చాం’’ అని రాష్ట్రపతి తెలిపారు.

విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా భారతదేశం ఎదగడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని ఆమె గుర్తు చేశారు. స్టార్టప్‌లకు దేశంలో అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందని పేర్కొన్నారు. సెమీకండక్టర్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌‌లలో పారదర్శకత పెరిగిందని ఆమె చెప్పారు. ‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. చరిత్రలో అతిపెద్ద ఎన్నికల క్రతువు అదే. ఆ సమయంలో ఎన్నికల సంఘం, భద్రతా సిబ్బంది పోషించిన పాత్ర అనన్య సామాన్యమైంది’’ అని ముర్ము తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X