KTR Writes To External Affairs Minister For The Release Of Sirisilla Resident Narsayya

Sirisilla Resident Narsayya Stuck in Bahrain Jail After Losing Passport

KTR Assures Efforts to Bring Narsayya Back to India

Urges Initiative from Both the Ministry of External Affairs and the State Government

KTR Requests Support from State Chief Secretary’s Office

Hyderabad : BRS Working President KTR has assured support for 62-year-old Narsayya, a resident of Cheerlavancha village in Thangallapalli Mandal of Sirisilla district, who is currently stuck in a Bahrain jail after losing his passport. KTR has written a letter to External Affairs Minister S. Jaishankar, urging immediate action to bring Narsayya back to India. Narsayya, who had been untraceable for several years, was found to be in a Bahrain jail due to passport issues. Narsayya had gone to Bahrain 28 years ago for work but got trapped there without a valid passport and work permit.

Narsayya, who went to Bahrain in 1996, worked as a mason for three years at The Arab Engineering and Contracting Company. Despite his work permit expiring in August 1999, he continued working there. His passport expired in 2001, but the Indian Embassy in Bahrain renewed it. However, the renewed passport also expired, and Narsayya lost it. Without a valid work permit and passport, Bahrain police arrested him for staying illegally in the country and detained him in jail. His wife Lakshmi, daughters Sona and Aparna, and son Babu have appealed for his return to India.

Upon learning of Narsayya’s plight, KTR responded, pledging full support to bring him back to India. He requested the Ministry of External Affairs to take the initiative and issue a temporary passport for Narsayya. KTR also requested the state government to provide full cooperation in this matter, including the issuance of a passport for Narsayya. He has written to the office of the State Chief Secretary, requesting immediate intervention to facilitate Narsayya’s return.

KTR highlighted that for Narsayya to be released and sent back to India, his identity as an Indian citizen needs to be confirmed to the Bahraini authorities. The Bahrain government’s Labor Market Regulatory Authority has written to the Indian Embassy in Bahrain, asking for proof of Narsayya’s identity, which needs to be provided by January 8, 2024. KTR urged the state government to cooperate in ensuring Narsayya’s swift return to India. He stated that once the Indian government issues a temporary passport, the Bahraini authorities would likely deport Narsayya back to India.

Additionally, KTR called for coordination between the party’s NRI wing in Bahrain and the BRS NRI wing to assist in Narsayya’s release. He mentioned that the Hyderabad Passport Officer needs to review old records to locate Narsayya’s address and provide a report through the relevant District Collector and SP. KTR assured that he would personally speak to the Hyderabad Passport Officer, Sirisilla District Collector, and SP to expedite the report. He has directed his office staff to coordinate with the district administration and the state’s NRI Affairs Department to accelerate the process for Narsayya’s return.

Also Read-

సిరిసిల్లా నర్సయ్య విడుదల కోసం విదేశాంగ మంత్రికి కెటిఅర్ లేఖ

పాస్ పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల వాసి నర్సయ్య

నర్సయ్య ను భారత్ కు రప్పించేందుకు కృషి చేస్తానన్న కేటీఆర్

విదేశాంగ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా ఈ మేరకు కేటీఆర్ విజ్ఞప్తి

బహ్రెయిన్ లోని పార్టీ ఎన్ఆర్ఐ విభాగం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయం చేసుకొని నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచన

హైదరాబాద్ : బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏండ్ల మానువాడ నర్సయ్యకు అండగా ఉంటానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నర్సయ్యను వేంటనే దేశానికి రప్పించేలా చూడాలని కోరుతూ విదేశాంగ శాఖా మంత్రి ఎస్. జయశంకర్ కు కెటిఅర్ ఈ మేరకు ఒక లేఖ రాశారు. అనేక సంవత్సరాలుగా ఆచూకీ లేకుంటే పోయిన నర్సయ్య బహ్రెయిన్ లోని జైల్లో పాస్పోర్ట్ సమస్యలతో చిక్కుకున్నారు. బతుకు దెరువు కోసం 28 ఏళ్ల క్రితం బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య బహ్రెయిన్ లో చిక్కుకు పోయారు. గత జనవరి నుంచి అక్కడి జైల్లో ఉన్నాడు.

1996 లో బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య అక్కడి ది అరబ్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో మూడేళ్ళ పాటు తాపీ మేస్త్రీ గా పనిచేశాడు. 1999 ఆగస్ట్ లో ఆయన వర్క్ పర్మిట్ ముగిసినా ఆయన అక్కడే పనిచేస్తూ ఉన్నాడు నర్సయ్య. ఆయన పాస్ పోర్ట్ గడువు 2001 లో ముగియటంతో బహ్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ రెన్యువల్ చేసింది. ఇప్పుడు ఆ పాస్ పోర్ట్ గడువు కూడా ముగిసింది. నర్సయ్య పాస్ పోర్ట్ పొగొట్టుకున్నాడు. వర్క్ పర్మిట్, పాస్ పోర్ట్ లేకపోవటంతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్నాడని నర్సయ్యను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. దీంతో నర్సయ్య జైల్లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది . నర్సయ్యను భారత్ కు రప్పించాలని అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబు కోరుతున్నారు.

ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి రావటంతో ఆయన స్పందించారు. నర్సయ్య ను భారత్ కు రప్పించేందుకు అన్ని విధాలుగా తన సహకారం ఉంటుందని చెప్పారు. నర్సయ్యకు తాత్కాలిక పాస్ పోర్ట్ ను ఇచ్చే విషయంలో విదేశాంగ శాఖ చొరవ చూపాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కి విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను కెటిఅర్ రాశారు. కేంద్ర విదేశాంగ శాఖ తోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో పూర్తి సహకారం అందించి నర్సయ్య పాస్పోర్ట్ జారీ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా ఈ మేరకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నర్సయ్యను విడుదల చేసి భారత్ కు పంపించాలంటే ఆయన భారతీయుడని తెలిపే ఆధారాలను బహ్రెయిన్ ప్రభుత్వానికి సమర్ఫించాల్సి ఉందని, నర్సయ్య గుర్తింపును ధృవీకరించాలని బహ్రెయిన్ ప్రభుత్వ సంస్థ ‘లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ’ 2024 జనవరి 8న బహ్రయిన్ లోని భారత రాయబారికి లేఖ రాసిందని తెలిపిన కేటీఆర్, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నర్సయ్యను వెంటనే స్వదేశానికి పంపించే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నర్సయ్య కు భారత ప్రభుత్వం తాత్కాలిక పాస్ పోర్ట్ ను జారీ చేస్తే బహ్రెయిన్ ప్రభుత్వం అతన్ని డిపోర్ట్ చేసి తిరిగి భారత్ కు పంపించే అవకాశం ఉందన్నారు.

అదే విధంగా బహ్రెయిన్ లోని పార్టీ ఎన్ఆర్ఐ విభాగం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయం చేసుకొని నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి పాత రికార్డులను పరిశీలించి నర్సయ్య చిరునామా కనుక్కొని సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ల ద్వారా నివేదిక నివేదిక ఇవ్వాల్సి ఉందని, ఈ విషయంలో హైదరాబాద్ పాస్ పోర్ట్ అధికారి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ తో తో మాట్లాడి వీలైనంత నివేదిక ఇచ్చేలా ప్రయత్నం చేస్తానని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం తో పాటు రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ ప్రక్రియను మరింత వేగంగా తీసుకెళ్లాలని తన కార్యాలయ సిబ్బందికి కేటీఆర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X