हैदराबाद: स्टेट बैंक ऑफ इंडिया (SBI) ने एक अहम ऐलान किया है। दो हजार रुपए के नोट बदलने को लेकर एक अहम जानकारी सामने आई है। खुलासा किया है कि महज एक हफ्ते में करीब ग्राहकों ने 17 हजार करोड़ रुपए के दो हजार रुपए के नोट जमा किए हैं।
इसका मतलब है कि लोगों ने बैंकों में जाकर 2000 रुपये के 17 हजार करोड़ के नोट एसबीआई में जमा किये हैं। बैंक 23 मई से 2000 रुपये के नोट बदलने की सुविधा उपलब्ध कराई हैं। यह प्रक्रिया 30 सितंबर तक चलेगी।
मालूम हो कि प्रधानमंत्री नरेंद्र मोदी ने 2016 में नोटबंदी के बाद 2000 रुपये के नए नोट प्रचलन में लेकर आये थे। 500 रुपये और 1000 रुपये के पुराने नोटों को बंद करने के बाद 2000 रुपये के नोट चलन में आए। साथ ही 500 रुपये के नये नोट भी उपलब्ध कराए गए। हाल ही में भारतीय रिजर्व बैंक (RBI) ने 2000 रुपये के नोटों को वापस ले लिया है।
రూ.2 వేల నోట్లు : వారం రోజుల్లో 17 వేల కోట్లు మార్చుకున్నారు
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్ల ఎక్స్చేంజ్ విషయంలో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. కేవలం వారం రోజుల వ్యవధిలో దాదాపు రూ. 17 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను కస్టమర్స్ డిపాజిట్ చేశారని వెల్లడించింది.
అంటే ప్రజలు వారి వద్ద ఉన్న రూ. 17 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను ఎస్‌బీఐకు బ్యాంకులకు వెళ్లి డిపాజిట్ చేశారు. బ్యాంకులు మే 23 నుంచి రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ. 2 వేల నోట్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పాత రూ. 500 నోట్లు, రూ.1000 నోట్ల రద్దు తర్వాత రూ. 2 వేల నోట్లు చెలామణిలోకి వచ్చాయి. ఇంకా కొత్త రూ. 500 నోట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ. 2 వేల నోట్లను ఉపసంహరిచుకుంది. (ఏజెన్సీలు)