జడ్చర్ల బహిరంగసభలో కాంగ్రెస్ నేతల విమర్శలపై నిప్పులు చెరిగిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ పాలనలో అన్నీ పెండింగ

నీళ్లు పెండింగ్
నిధులు పెండింగ్

కరంటు పెండింగ్
ఫించన్ పెండింగ్

పాలన పెండింగ్
ప్రజల సమస్యలు పెండింగ్

పెండింగ్ కు పర్యాయపదం కాంగ్రెస్

హైదరాబాద్: నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపమే పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు

కాంగ్రెస్ పార్టీ వారు ఏ మొకం పెట్టుకుని పాలమూరు ప్రజలను ఓట్లు అడుగుతారు

అధికారం ఎప్పుడు దక్కుతుందా అని కాంగ్రెస్ నేతలు కళ్లలో వత్తులు వేసుకుని చూస్తున్నారు .. కానీ 5 దశాబ్దాల అధికారంతోనే కదా అధోగతి పట్టించింది

పాలమూరుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో కళ్ల ముందు కనిపిస్తున్నది

నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలన చూసి 2018లో ఉమ్మడి పాలమూరులో 14కు 13 స్థానాల్లో ప్రజలు పట్టంకట్టారు

ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పాలకుల సామర్ద్యానికి గీటురాయి

అయిదు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు

కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాలో స్థానం లేదు.. వారి పొలిటికల్ డ్రామాలు ఇక్కడ పండవు

కర్ణాటక ఫలితాలు చూసి కాంగ్రెస్ నేతలు పగటికలలు కంటున్నారు

అక్కడ ప్రత్యామ్నాయం లేక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారు

అక్కడ అధికారం రాగానే ఇక్కడ కాంగ్రెస్ నేతలకు ఆశలు మొదలయ్యాయి

పార్టీలో ఒకరిపై ఒకరు పై చేయి సాధించే పవర్ కోసమే వారి పాదయాత్రలు

కాంగ్రెస్ పార్టీలో అందరూ కట్టప్పలే .. పాలమూరు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి, పోతిరెడ్డిపాడుతో వెన్నుపోటు పొడిచి, పాలమూరు ప్రజలను వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యల పాలు చేశారు

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద కేసులు వేసి అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అయ్యిందనడం ఆశ్చర్యకరం

9 ఏళ్లలో పాలమూరు వ్యవసాయరంగ స్వరూపం మారిపోయింది

నడి ఎండాకాలంలో చెరువుల్లో ఉన్న నీరే కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు సమాధానం. నాడు మీ పాలనలో అంబలికేంద్రాలు, గంజి కేంద్రాలు ఉండేవి.. నేడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి

నాడు మీ పాలనలో గ్రామాల్లో సాగునీరే కాదు తాగునీటికీ ఇబ్బందులే

పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

అధికారం మీద కాంగ్రెస్ దింపుడుకళ్లెం ఆశతో ఉంది

ఈ సారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మాదిరే అవుతుంది

కాంగ్రెస్ నేతలు నోటి కొచ్చినట్లు మాట్లాడడం మాని మీ పాలనలో జరిగిన అన్యాయాలకు పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలి

1946 – 51 మధ్యకాలంలో, 1969 తెలంగాణ ఉద్యమంలో, మలిదశ (2001 – 2014) తెలంగాణ ఉద్యమంలో యువకుల కాల్చివేత, అమరత్వం, కాంగ్రెస్ పార్టీని ఎల్లకాలం పట్టి పీడిస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X